అసలే ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది.ఈ సీజన్‌లో మండే ఎండలు, ఉక్కపోత, వడ గాలులు వంటి కారణాల వల్ల ఎప్పుడూ నీరసంగా, బద్ధకంగా మరియు చికాకుగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఏ పని చేయలేకపోతుంటారు.అసలు ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు.
ఇలా మీకు అనిపిస్తుందా.? అయితే వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే టీని తీసుకుంటే క్షణాల్లోనే నీరసం, బద్ధకం, చికాకు వంటి వాటిని నివారించుకుని బాడీని రీఫ్రెష్ గా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీ ఏంటో.
ఎలా తయారు చేసుకోవాలో.తెలుసుకుందాం పదండీ.
ప్రస్తుత వేసవి కాలంలో విరి విరిగా లభించే పండ్లు మామిడి పండ్లు. అద్భుతమైన రుచిని కలిగి ఉండే మామిడి పండ్లతోనే ఇప్పుడు టీ తయారు చేసుకోబోతున్నాము.
ముందుగా పండిన ఒక మామిడి పండును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల పటిక బెల్లం పొడి వేసి బాగా మరిగించి.డికాక్షన్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ డికాక్షన్‌ను పూర్తిగా చల్లారబెట్టుకుని ఓ అర గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక జార్ తీసుకుని అందులో చిల్డ్ డికాక్షన్, మూడు టేబుల్ స్పూన్ల మామిడి పండు పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం, అర కప్పు వాటర్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తే మ్యాంగో ఐస్ టీ సిద్ధం అవుతుంది.
సూపర్ టేస్టీగా ఉండే ఈ టీ రోజుకు ఒక కప్పు చప్పున తాగితే నీరసం, అలసట, బద్ధకం, చికాకు వంటివన్నీ దూరమై బాడీ క్షణాల్లో రీఫ్రెష్ అవుతుంది.