మంజుభార్గవికి శంకరాభరణం మూవీలో అవకాశం ఎలా వచ్చిందో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్ సినిమాల లిస్టు తీసుకుంటే అందులో శంకరాభరణం సినిమా తప్పకుండా ఉంటుంది.దర్శకుడు కె.

 How Manju Bhargavi Got An Opportunity In Movie Shankarabharanam, Manju Bhargavi,-TeluguStop.com

విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం నమోదుచేసుకుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా చేసి ఎనలేని పేరు పొందింది మంజు భార్గవి.

అంతకు ముందు పలు సినిమాల్లో ఆమె నటించినా.ఈ సినిమాతోనే ఆమె పేరు, గుర్తింపు లభించాయి.

ఇంతకీ మంజు భార్గవికి ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిజానికి మంజుభార్గ‌వి మంచి నాట్య‌ కళాకార‌ణి.

కూచిపూడిలో మంచి పట్టు ఉంది.ఈ కళ ఆధారంగానే ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టింది.

పలు చిన్నాచితకా వేషాలు వేసింది.ఆ తర్వాత తనకు శంకరాభరణం సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడంతో కనీవినీ ఎరుగని రీతిలో గుర్తింపు వచ్చింది.

ఒకరోజు చెన్నైలో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ వేడుక జరిగింది.అందులో గీత‌, మంజు భార్గ‌వి, మ‌రో న‌టి వరుసగా నిలబడి వచ్చిన అతిథులకు పన్నీరు చల్లి ఆహ్వానిస్తున్నారు.

అలా వచ్చిన వారిలో విశ్వనాథ్ కూడా ఉన్నాడు.అప్పటికే తను శంకరాభరణం సినిమా గురించి కసరత్తు చేస్తున్నాడు.

అక్కడ మంజు భార్గవిని చూడగానే తన సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఈమె సరిగ్గా సూటవుతుందని భావించాడు.

ఆ వేడుక అయ్యాక కొద్ది రోజులకు తనను ఆఫీస్ కు రమ్మని చెప్పాడు విశ్వనాథ్.

Telugu Vishwanath, Makrup, Manju Bhargavi-Telugu Stop Exclusive Top Stories

కొన్ని సినిమాల్లోని సీన్లు చెప్పి నటించమని చెప్పాడు.కాస్ట్యూమ్స్ వేసి టెస్ట్ చేశాడు.ఆమెతో డబ్బింగ్ కూడా చెప్పించాడు.వాయిస్ కూడా తనకు బాగా నచ్చింది.నీ ఫోటో ఒకటి కావాలని అడిగాడు.సరే అని చెప్పి బయటకు వెళ్లి ఆ సంగతి మర్చిపోయింది.

నెల రోజుల తర్వాత శంకరాభరణం యూనిట్ నుంచి ఓ వ్యక్తి వచ్చి ఫోటో కావాలి అని అడుగుతాడు.అప్పుడు తను వెళ్లి పలు రకాల స్టిల్స్ తీసుకుంటుంది.

ఆ తర్వాత జెవి, సోమయాజులు, మంజు భార్గవికి కలిపి మేకప్ టెస్టు చేయిస్తాడు విశ్వనాధ్.అన్నీ ఓకే అనుకున్నాక శంకరాభరణం సినిమాలో హీరోయిన్ గా మంజు భార్గవిని ఓకే చేశాడు కె.విశ్వనాథ్.ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు ఆమె పరిచయం అయ్యింది.

తొలి సినిమాతోనే అద్భుత విజయాన్ని సాధించి.ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube