దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కొత్తిమీరను విరివిగా వాడుతుంటారు.ముఖ్యంగా నాన్ వెజ్ వంటల్లో, బిర్యానీ పులావ్ వంటి రైస్ ఐటమ్స్ లో కచ్చితంగా కొత్తిమీర(C oriander ) పడాల్సిందే.
రుచిని పెంచడంలో మరియు ఫుడ్ కు ప్రత్యేకమైన ఫ్లేవర్ ను జోడించడంలో కొత్తిమీరకు మరొకటి సాటి లేదు.అలాగే ఆరోగ్య పరంగా కొత్తిమీర అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
అంతే కాకుండా జుట్టు సంరక్షణకు సైతం మద్దతు ఇస్తుంది.కొత్తిమీరతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే మీ కురులు డబుల్ అవడం ఖాయం.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి అలాగే మూడు రెబ్బలు కరివేపాకు, నాలుగు లవంగాలు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ బాదం నూనె, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ( Almond oil )వేసుకుని బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

ఈ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను కనుక వాడితే మీ కురుల ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందుతుంది.
జుట్టు ఎదగడం స్టార్ట్ అవుతుంది.కురులు క్రమంగా ఒత్తుగా మారుతాయి.
అలాగే ఈ టానిక్ ను వాడటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.చుండ్రు, తలలో దురద వంటివి తగ్గు ముఖం పడతాయి.
జుట్టు మూలాల నుంచి సైతం బలోపేతం అవుతుంది.







