సాధారణంగా కొందరి ముఖ చర్మం సాగిపోయి కనిపిస్తుంటుంది.స్కిన్ ఏజింగ్ వల్ల కనిపించే లక్షణాల్లో ఇది ఒకటి.
వయసు పైబడిన వారిలో చర్మం సాగడం సహజమే.కానీ వయసులో ఉన్న వారు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు.
అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను ప్రయత్నిస్తే చర్మాన్ని సూపర్ టైట్ అండ్ బ్రైట్ గా మెరిపించుకోవచ్చు.

టిప్ 1:
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నీరు తొలగించిన పెరుగు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కీర జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఆపై తడి క్లాత్ సహాయంతో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ చిట్కాను పాటిస్తే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.
ముడతలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.మరియు చర్మం బ్రైట్ గా సైతం మెరుస్తుంది.

టి
ప్-2:
ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.సాగిన చర్మం బిగుతుగా మారుతుంది.మరియు స్కిన్ గ్లోయింగ్ గా సైతం మెరుస్తుంది.ఇక ఈ టిప్స్ ను ఫాలో అవ్వడం తో పాటు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.
చక్కెర, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండండి.రోజుకొక హెర్బల్ టీ తీసుకోవడం అలవాటు చేసుకోండి.
మరియు నిత్యం బాత్ అనంతరం మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోండి.







