ప్రస్తుత రోజుల్లో అధిక బరువుతో( Obesity ) బాధపడుతున్న వారి సంఖ్య భారీగా ఉంది.బరువు పెరగడానికి అందరిలోనూ ఒకే రకమైన కారణాలు ఉండనప్పటికీ.
ప్రధానంగా చూసుకుంటే ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఒత్తిడి, పలు అనారోగ్య సమస్యలు వెయిట్ గెయిన్( Weight Gain ) అవ్వడానికి కారణం అవుతాయి.ఈ క్రమంలోనే బరువు తగ్గి నాజూగ్గా మారడం కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రెగ్యులర్ గా ఈ జ్యూస్ తాగితే నాజూగ్గా మారడం ఖాయం.
అందుకోసం ముందుగా ఒక కీర దోసకాయను( Cucumber ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అంగుళం అల్లం ముక్కను( Ginger ) పొట్టు తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, అల్లం ముక్కలు మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో బ్లెండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకుని సరిపడా నిమ్మరసం కలిపి సేవించాలి.
రోజు మార్నింగ్ ఈ కీరా జింజర్ జ్యూస్ ను కనుక తీసుకుంటే అనేక ఆరోగ్య లాభాలను పొందుతారు.ముఖ్యంగా కీర దోసకాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మీకు కడుపు నిండుగా మరియు మీ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.అల్లం మీ జీవక్రియను పెంచుతుంది, ఇది కొవ్వును కాల్చడంలో మీకు తోడ్పడుతుంది.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ జ్యూస్ మంచి ఎంపిక అవుతుంది.పైగా ఈ కీరా జింజర్ జ్యూస్ మీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.బాడీని డీటాక్స్ చేసి హైడ్రేట్ గా ఉంచుతుంది.
అంతే కాకుండా ఈ జ్యూస్ జీర్ణశక్తిని పెంచుతుంది.అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.