పూర్వకాలంలో మన పెద్దలు ఇంటిని దేవాలయంగా భావించేవారు.అలాంటి ఇంటిని నిర్మించడానికి ఎన్నో పద్ధతులను పాటిస్తారు.
అలాంటి వాటిలో వాస్తు ముఖ్యం.మన ఇంటిని నిర్మించేటప్పుడు తప్పకుండా వాస్తును పరిశీలించి ఇంటి నిర్మాణం చేపడతారు.
కానీ కొందరు దేవాలయానికి సమీపంలో ఇంటిని నిర్మించకూడదు అని చెబుతుంటారు.అలాగే ఆలయంలో ప్రతిష్టించి ఉన్న ధ్వజస్తంభం కూడా మన ఇంటి పై పడకూడదని చాలామంది భావిస్తారు.
అయితే ఆ విధంగా ఆలయానికి సమీపంలో ఇంటిని ఎందుకు నిర్మించకూడదు? మన ఇంటి పై ధ్వజస్తంభం నీడ ఎందుకు పడకూడదు? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం….
వాస్తు శాస్త్రం ప్రకారం దేవాలయాల నీడ ఇంటిపై పడకూడదు.
ఆ విధంగా దేవాలయం నీడ ఇంటి పై పడుతుందో ఆ ఇంటిలో ఐశ్వర్యం ఇంకిపోతుంది.ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయుష్షు తగ్గిపోతుందని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
ఒకవేళ ఆలయం చుట్టూ పరిసరప్రాంతాలలో ఇంటి నిర్మించుకోవాలంటే ఒక్కో ఆలయాన్ని భట్టి ఒక్కో దూరంలో ఇంటిని నిర్మించుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

శివాలయం విషయానికి వస్తే శివాలయం పరిధి చుట్టూ దాదాపు వంద మీటర్ల దూరం ఇంటిని నిర్మించకూడదు.అదేవిధంగా విష్ణు దేవాలయం వెనుక భాగంలో ఇంటిని నిర్మించకూడదు.ఈ ఆలయం వెనుక భాగాన 100 మీటర్లు, ముందుభాగాన 50 మీటర్ల దూరం వరకు ఇంటి నిర్మించకూడదు.
అదేవిధంగా శక్తి ఆలయానికి కుడి ఎడమ వైపు ఇంటి నిర్మాణం చేపట్టకూడదు.ఎందుకనగా అమ్మవారి రెండు చేతులలో శత్రు సంహారానికి ఉపయోగించే ఆయుధాలు ఉంటాయి కాబట్టి అమ్మవారి గుడికి ఇరువైపుల 120 మీటర్ల వరకు ఇంటి నిర్మాణం చేపట్టకూడదు.
అదే విధంగా కేవలం దేవాలయం నీడ మాత్రమే కాకుండా ఆలయంలో ధ్వజస్తంభం నీడ కూడా మన ఇంటి పై పడకూడదని చెబుతుంటారు.దేవుడి ధ్వజము శక్తి సంపన్నం, ఉగ్రరూపం.
అందుకే ధ్వజస్తంభం ధ్వజము దేవుడి వైపు తిరిగి ఉంటుంది.ఇక గరుడ స్తంభాన్ని దీపపు స్తంభం అని కూడా పిలుస్తారు.
ఈ స్తంభంపై వెలిగే దీపం ఆకాశంలో విహరిస్తున్న దేవతలకు దారి చూపుతుంది.ఆ విధంగా దేవతలకు దారి చూపే దీపం మీద మన ఇంటి పై, పడకూడదని, ఆ వెలుతురును మనం చూడకూడదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.