ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఫేస్‌బుక్ ఉంటుంది.ఫొటోలకి లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం, ఇతరులు పెట్టిన పోస్ట్ లను చూడడం ఇలా ఒక్కటేమిటి.
భలే టైం పాస్.అయితే, ఫేస్‌బుక్ లో గ్రూప్స్ అనే ఫీచర్ కూడా ఉంది.
వాట్సాప్ లో గ్రూప్స్ ఉన్న మాదిరి.ఫేస్‌బుక్ లోనూ గ్రూప్స్ ఉన్నాయి.
ఫేస్‌బుక్‌లో ప్రస్తుతం గ్రూప్‌ల సంఖ్య పెరిగిపోతోంది.గ్రూప్‌ల్లో వేలాది మంది సభ్యులు ఉంటున్నారు.
దీంతో గ్రూపులు ఎప్పుడు బిజీగా మారిపోతున్నాయి.
గ్రూపుల్లో కొందరు మెంబర్లు ఎప్పటికప్పుడు సరైన సమాచారంతో సంబంధిత పోస్టులు సభ్యులతో షేర్ చేసుకుంటుంటారు.
ప్రతి ఒక్కరూ.ఫేస్ బుక్ లోని ఏదో ఒక గ్రూప్ లో మెంబర్‌గా ఉండటం సహజమే.
మనం మెంబర్ గా ఉన్న గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా అది మిగతా అందరికి తెలుస్తుంది.అయితే, కొందరికి మాత్రం తమ పేరు కనిపించకుండా గ్రూపులో పోస్ట్ చేయాలని ఉంటుంది.
అయితే.అది గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ ఓ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మాత్రం వీలుపడుతుంది.
ఎవరైనా తమ పేరుని హైడ్ చేస్తూ.ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే గ్రూప్ అడ్మిన్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ను ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది.
అయితే, మనం మన పేరు హైడ్ చేసి పోస్ట్ చేసిన ఆ పోస్ట్ గ్రూపులోని సభ్యులకు తెలియక పోవచ్చు.కానీ, ఎవరు చేశారో గ్రూప్ అడ్మిన్లు, మాడరేటర్లు, ఫేస్‌బుక్ టీమ్స్‌కు తెల్సుతుంది.
అయితే.ఈ ఫీచర్ ను ఎలా వాడాలో తెలుసుకుందాం.ఫేస్‌బుక్‌లో లాగిన్ అయిన తర్వాత. గ్రూప్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి.మీరు మెంబర్ గా ఉన్న గ్రూపుల్లో.మీరు పేరు లేకుండా పోస్ట్ చేయాలనుకుంటున్న గ్రూప్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
అందులో గ్రూప్ అడ్మిన్ అనానిమస్ పోస్ట్ ఫీచర్ ను ఎనేబుల్ చేసి.అందులో Anonymous Post ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత Create Anonymous Post పైన క్లిక్ చేయాలి.అనంతరం Create Post విండో ఓపెన్ అవుతుంది.
ఇక మీ పోస్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.మీ పోస్ట్ గ్రూప్ అడ్మిన్లతో పాటు మాడరేటర్లకు వెళ్తుంది.
గ్రూప్ అడ్మిన్, మాడరేటర్ అప్రూవ్ చేసిన తర్వాతే మీ పోస్ట్ పబ్లిష్ అవుతుంది.
అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేయండిలా.
మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగిన్ కావాలి.మీరు క్రియేట్ చేసిన గ్రూప్స్ ఓపెన్ చేయాలి.Admin Tools సెక్షన్‌లో Settings ఓపెన్ చేయాలి.Anonymous Posting సెక్షన్‌లో ఈ ఫీచర్ ఎనేబుల్ చేయండి.ఆ తర్వాత సేవ్ క్లిక్ చేస్తే ఫేస్‌బుక్ గ్రూప్‌లో అనానిమస్ పోస్ట్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది.