చలికాలంలో వేధించే ఒళ్ళు నొప్పులను ఈజీగా వదిలించుకోవడం ఎలానో తెలుసా?

ప్రస్తుతం చలికాలం అన్న సంగతి తెలిసిందే.చలి పులి కారణంగా చాలా మంది నానా అవస్థలు పడుతున్నారు.

 Do You Know How To Easily Get Rid Of Body Pains In Winter Details, Body Pains, W-TeluguStop.com

చలికాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో ఒళ్ళు నొప్పులు ఒకటి.ముఖ్యంగా ఉదయం నిద్ర లేచే సమయానికి విపరీతమైన ఒళ్ళు నొప్పులు తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తాయి.

ఒళ్ళు నొప్పుల కారణంగా ఏ పనిలోనూ చురుగ్గా పాల్గొనలేక పోతుంటారు.ఈ క్రమంలోనే కొందరు ఒళ్ళు నొప్పులు నివారించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.

కానీ అవి ఏ మాత్రం ఆరోగ్యానికి మంచివి కాదు.మరి ఒళ్ళు నొప్పులను వదిలించుకోవడం ఎలా అనొచ్చు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు గ్రేట్ గా సహాయపడతాయి.మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

చలికాలంలో వేధించే ఒళ్ళు నొప్పులను నివారించడానికి చామంతి టీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.రోజులో ఏదో ఒక సమయంలో ఒక కప్పు చామంతి టీ ని తీసుకుంటే ఒళ్ళు నొప్పులు అన్న మాటే అనరు.

పైగా చామంతి టీని తీసుకోవడం వల్ల రాత్రుళ్ళు సుఖమైన నిద్ర పడుతుంది.

అలాగే ఒళ్ళు నొప్పులను వదిలించడానికి పసుపు గ్రేట్ గా సహాయపడుతుంది.నైట్ నిద్రించే ముందు ఫ్యాట్ లెస్ మిల్క్ లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరిగించి సేవిస్తే ఒళ్ళు నొప్పులకు దూరంగా ఉండవచ్చు.పసుపు పాలు తీసుకోవడం వల్ల చలి పులిని తట్టుకునే సామర్థ్యం కూడా లభిస్తుంది.

ఇక చలికాలంలో బాడీ పెయిన్స్ తో బాధపడుతుంటే ఖచ్చితంగా ఆపిల్ సైడర్ వెనిగర్ వాడండి.ఒళ్ళు నొప్పులను ఈజీగా వదిలించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.అందుకోసం బకెట్ గోరువెచ్చని నీటిలో అర‌ కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి స్నానం చేయాలి.ఇలా చేస్తే ఒళ్ళు నొప్పుల నుంచి చక్కటి రిలీఫ్ ని పొందుతారు.

కాబట్టి ప్రస్తుత చలికాలంలో ఎవరైతే తరచూ ఒళ్ళు నొప్పుల సమస్యను ఫేస్ చేస్తున్నారో.వారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube