వేసవి కాలం ముగిసి వర్షాకాలం స్టార్ట్ అవుతున్న సమయంలో దొరికే పండ్లలో నేరేడు( Java Plum ) ఒకటి.జావా ప్లమ్, జామున్, జంబుల్, ఇండియన్ బ్లాక్ బెర్రీ వంటి పేర్లతో ఈ పండ్లను పిలుస్తుంటారు.
కేవలం ఈ సీజన్ లో మాత్రమే నేరేడు పండ్లు లభ్యం అవుతుంటాయి.వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్లతో నేరేడు పండ్లు నిండి ఉంటాయి.
కేలరీలు, పిండి పదార్థాలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి.అందువల్ల ఆరోగ్యానికి నేరేడు తోడుగా ఉంటుంది.
అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా నేరేడు పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థ కు మద్దతు ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
బలమైన రోగ నిరోధక వ్యవస్థ అంటు వ్యాధులు మరియు అనారోగ్యాలకు వ్యతిరేకంగా పారాడుతుంది.అలాగే నేరేడు పండ్లలో యాంటీ-క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో నిరూపితం అయింది.
అందువల్ల ఈ సీజనల్ ఫ్రూట్ ను తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు.

మధుమేహం( Diabetes ) ఉన్న వారు పండ్లు తినడానికి భయపడుతుంటారు.కానీ నేరేడు పండ్లను మధుమేహం ఉన్నవారు కూడా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే సామర్థ్యం నేరేడు పండ్లకు ఉంది.
నేరేడు పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.తిన్న తర్వాత ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.
ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పోషించడానికి మద్ధతు ఇస్తుంది.

అంతేకాదు నేరేడు పండ్లు నోటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి.చిగుళ్ల వ్యాధి, కావిటీలను నివారించడంలో మరియు నియంత్రించడంలో తోడ్పడతాయి.
కాబట్టి ఆరోగ్యకరమైన చిగుళ్ళు మరియు దంతాలను కోరుకునేవారు ఈ వర్షాకాలంలో దొరికే నేరేడు పండ్లను అస్సలు మిస్ అవ్వకండి.