రాత్రి సమయంలో ఖర్జురాలను నానబెట్టి ఉదయం పరగడుపున తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.సాధారణంగా ఖర్జురాలు అనేవి చాలా ఆరోగ్యకరమైన ఆహారం.
రాత్రంతా నానబెట్టటం వలన ఖర్జురంలో పోషక విలువలు పెరుగుతాయి.ప్రతి రోజు ఉదయం పరగడుపున నానబెట్టిన మూడు ఖర్జురాలను తింటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు
ఖర్జూరంలో సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకల బలానికి,అభివృద్ధికి సహాయపడుతుంది
ఖర్జూరంలో నికోటిన్ ఉండుట వలన ప్రేగులకు సంబందించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది
ఖర్జూరంలో ఫైబర్,ఎమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన ఆహార జీర్ణ క్రియను ప్రేరేపిస్తాయి.
జీర్ణక్రియ బాగా ఉండుట వలన మలబద్దకం సమస్య కూడా ఉండదు.
ఖర్జూరంలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్త హీనత తో బాధపడుతున్న వారికి చాలా మేలు చేస్తుంది.రక్త హీనత తో బాధపడుతున్న వారిలో ఐరన్ లేకపోవటం వలన అలసట, బలహీనత కలుగుతాయి.ఖర్జూరంలో ఉండే ఐరన్ ఈ సమస్యను తగ్గిస్తుంది
నానబెట్టిన ఖర్జురాలను ఉదయమే తినడం వల్ల మూత్రాశయ సమస్యలు తొలగిపోతాయి
గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు కూడ తగ్గిపోతాయి
కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి ఖర్జూరాలకు ఉండటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువే అని చెప్పవచ్చు
ఖర్జురంలో విటమిన్ బి5 ఉండటం వలన చర్మానికి కూడా ఎంతో మేలును చేస్తుంది.