ప్రస్తుత కాలంలో కంటి చూపు తగ్గడం వల్ల చిన్న వయసు నుంచే చాలామంది కళ్లద్దాలను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.కంటి చూపు( Eye sight ) తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
కంప్యూటర్లను ఇంకా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా చూడడం వల్ల కంటి చూపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇంకా తక్కువగా నిద్రపోవడం వల్ల కంటి చూపు చాలా తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే పోషకాహార లోపం వల్ల కూడా కంటి చూపు దెబ్బతింటుంది.ఇలా చాలా రకాల కారణాల వల్ల కంటిచూపు దెబ్బతింటుంది.
ఇంకా చెప్పాలంటే కంటిచూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు సహజసిద్ధ ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా కంటి చూపును సులభంగా మెరుగుపరుచుకోవచ్చు.
కంటి చూపును కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మనకు విటమిన్ ఏ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే మాంసాహారంలో విటమిన్ ఏ నేరుగా అదే రూపంలో ఉంటుంది.కానీ శాఖాహారులలో విటమిన్ ఏ అనేది కెరోటిన్ రూపంలో ఉంటుంది.
ఇక దీనిని మన శరీరంలో ఉండే కాలేయం విటమిన్ ఏ రూపంలో మార్చుతుంది.విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహారాలలో క్యారెట్ ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
రోజుకు రెండుసార్లు క్యారెట్ జ్యూస్ ను త్రాగాలి.అయితే క్యారెట్ జ్యూస్ ను నేరుగా తాగలేని వారు జ్యూస్ ను పట్టేటప్పుడు జార్ లో క్యారెట్ ముక్కలు, కీరదోష ముక్కలు, టమోటా ముక్కలు( Tomato Slices ), ఇంకా బీట్ రూట్( Beet root ) వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవడం మంచిది.
ఆ తర్వాత ఈ జ్యూస్ ను వడ కట్టి అందులో తేనె( Honey ) వేసి తీసుకోవాలి.ఇలా రోజుకు రెండుసార్లు క్యారెట్ జ్యూస్( Carrot juice ) ను తాగడం వల్ల కంటి చూపు కచ్చితంగా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే జ్యూస్ లో లేత కరివేపాకును( curry leaves ) మెత్తగా పేస్ట్ చేసి కలిపి తీసుకోవచ్చు.ఇలా కరివేపాకును తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది.
ఇంకా మునగాకులో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి చిట్కాలను పాటించడం వల్ల మనం సులభంగా కంటి చూపును మెరుగుపరచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.