మీ పిల్లలు రక్తహీనత బారిన పడ్డారా.. అయితే దాన్ని ఇలా తరిమికొట్టండి!

రక్తహీనత.( anemia ).పెద్దలతో పోలిస్తే పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.ఇందుకు ప్రధాన కారణం పోషకాహార లోపం.

 Best Smoothie For Avoiding Anemia In Kids , Anemia, Kids, Latest News, Health,-TeluguStop.com

పిల్లలకు ఏం పెట్టిన తినమ‌ని మారం చేస్తుంటారు.అందులోనూ హెల్తీ ఫుడ్ అయితే అస్స‌లు ద‌రిదాపుల్లోకి రానివ్వ‌రు.

దీంతో వారి శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు అందకుండా పోతాయి.ఫలితంగా రక్తహీనతతో సహా అనేక సమస్యలు ఏర్పడతాయి.

రక్తహీనత వల్ల పిల్లలు చాలా నీరసంగా, మూడీగా ఉంటారు.ఆటపాటల్లో చురుగ్గా పాల్గొనలేక పోతుంటారు.

చదువుల్లో వెనుక పడతారు.తరచూ జబ్బుల బారిన పడుతుంటారు.

మీ పిల్లలు కూడా రక్తహీనత బారిన పడ్డారా.? అయితే అస్స‌లు చింతించకండి.వెంటనే ఇప్పుడు చెప్పబోయే స్మూతీని వారి డైట్ లో చేర్చండి.ఈ స్మూతీ రక్తహీనతను తరిమి కొట్టడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Anemia, Anemia Symptoms, Tips, Latest, Smoothie-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు,( Dates ) రెండు డ్రై అంజీర్ మరియు ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు( Milk ) వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో ఒక అరటిపండు వేసుకోవాలి.అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న ఖర్జూరం, డ్రై అంజీర్ తో పాటు ఒక గ్లాసు పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ సిద్ధం అవుతుంది.

ఈ స్మూతీ హెల్తీ మాత్రమే కాదు చాలా టేస్టీగా ఉంటుంది.

Telugu Anemia, Anemia Symptoms, Tips, Latest, Smoothie-Telugu Health

పిల్లలకు ఇస్తే గడగడ తాగేస్తారు.రోజు మార్నింగ్ ఈ స్మూతీని పిల్లలకు ఇస్తే.ఐర‌న్‌, ప్రోటీన్, క్యాల్షియం, ఫైబర్ తో సహా అనేక పోషకాలు వారి శరీరానికి అందుతాయి.

ఈ స్మూతీ హిమోగ్లోబిన్ శాతాన్ని రెట్టింపు చేస్తుంది.రక్తహీనత సమస్యను నివారిస్తుంది.

పిల్లల్లో రక్తహీనతను త్వరగా తరిమికొట్టాలి అనుకుంటే ఖ‌చ్చితంగా ఈ స్మూతీని వారి డైట్ లో చేర్చండి.పైగా ఈ స్మూతీ పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.

వారిలో ఆలోచన శక్తిని రెట్టింపు చేస్తుంది.ఇమ్యూనిటీ సిస్టం ని సైతం బలపరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube