టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్( Anasuya Bharadwaj ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తాను నిరూపించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ నటిగా నిరూపించుకుంటోంది.
కాగా అనసూయ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే అనసూయ ఈ మధ్యకాలంలో సినిమాల విషయాలకంటే ఎక్కువగా ద్వారా సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తోంది.ముఖ్యంగా ఇటీవల కాలంలో అనసూయ సోషల్ మీడియాలో చేసే ట్వీట్ లు కాంట్రవర్సీలకు దారి తీస్తున్నాయి.కెరియర్ పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకోవడంతో పాటు, తాను ఎక్కడికి వెళ్లినా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూనే ఉంది అనసూయ.
అంతేకాకుండా తరచూ వెకేషన్ లు( Vacations ) తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.మొన్నటికి మొన్న తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్కు వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసిన అనసూయ ఇప్పుడు ఒక్కతే ఫారిన్ కు వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వాషింగ్టన్( Washington ) లోనా అనసూయ అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది అనసూయ.అక్కడ వీధుల్లో విహరిస్తూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చిల్ అవుతోంది.ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే అనసూయ విషయానికి వస్తే.ఇటీవలే విమానం, ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 ) లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టు తో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.