లార్డ్ గణేశుడికి చాక్లెట్ కేక్ సమర్పించిన విదేశీ మహిళ.. తర్వాతేమైందో చూడండి..

ఇటీవల ఒక విదేశీ వనిత భారతీయుల మనసు దోచుకుంది.లార్డ్ గణేశుడికి ఆస్ట్రియన్ చాక్లెట్ కేక్( Austrian Chocolate Cake for Lord Ganesha ) సమర్పించి అందరి దృష్టినీ ఆకర్షించింది.

 See What Happened Next When The Foreign Lady Offered Chocolate Cake To Lord Gane-TeluguStop.com

గ్లోరియా రీచ్ గోథార్డ్ ( Gloria Reich Gothard )అనే ఆస్ట్రియన్ మహిళ సనాతన ధర్మాన్ని అనుసరిస్తుంది.ఆమె వినాయకుడికి ప్రత్యేకంగా ట్రెడిషనల్ ఆస్ట్రియన్ చాక్లెట్ కేక్ సమర్పించి తన భక్తిని చాటుకుంది.

ఆమె సాచెర్టోర్టే ( Sachertorte ) అనే ప్రఖ్యాత ఆస్ట్రియన్ చాక్లెట్ కేక్ ను గణేశుడి విగ్రహం ముందు పెట్టింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసింది.“నేను ఆస్ట్రియన్ సనాతన ధర్మిని.మా దేవుళ్లకు ఆస్ట్రియన్ వంటకాలను సమర్పిస్తాను.

ఇది లార్డ్ శ్రీ గణేశుడి కోసం సాచెర్టోర్టే (చాక్లెట్ కేక్)” అని ఆమె పోస్ట్ చేసింది.

ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఆమె పోస్ట్ దాదాపు 5 లక్షల వ్యూస్‌ను దాటేసింది.చాలా మంది భారతీయులు ఆమె భక్తిని మెచ్చుకుంటున్నారు.ఆర్యన్ష్ అనే ఒక యూజర్, “వినాయకుడికి చాక్లెట్ మోదకాలు కూడా సమర్పించవచ్చు కదా” అని సలహా ఇచ్చాడు.“మీ స్వచ్ఛమైన మనస్సు ముఖ్యం.వినాయకుడు మీ సమర్పణను సంతోషంగా స్వీకరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు” అని మరొకరు గోథార్డ్ భక్తిని ప్రశంసించారు.

“దేవుళ్లు మనుషుల్లాగా సంకుచిత మనస్తత్వం కలిగినవారు కాదు.సమర్పించేటప్పుడు మీ ఉద్దేశం ముఖ్యం” అని ఇంకొకరు కామెంట్ చేశారు.భారతదేశంలో సాధారణంగా స్థానిక ఆహార పదార్థాలను సమర్పిస్తారని ఒక యూజర్ చెప్పగా, గోథార్డ్ వెంటనే అంగీకరిస్తూ, “అవును అది చాలా గొప్పది.ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలోని ఉత్తమ ఆహారాన్ని సమర్పించాలి” అని రిప్లై ఇచ్చింది.

సాచెర్టోర్టే అనేది ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక ప్రత్యేకమైన చాక్లెట్ కేక్.దీన్ని ఏప్రిల్ కాండిమెంట్ ( Apricot jam )తో తయారుచేసి, డార్క్ చాక్లెట్ గ్లేజ్‌తో కవర్ చేస్తారు.1832లో ఫ్రాంజ్ సాచర్ అనే అతను ప్రిన్స్ మెటర్నిచ్ కోసం దీన్ని తయారుచేశాడు.ఈరోజుల్లో ఇది ఆస్ట్రియన్ స్వీట్ కల్చర్ కు చిహ్నంగా నిలిచింది.

దీన్ని సాంప్రదాయకంగా విప్డ్ క్రీమ్‌తో సర్వ్ చేస్తారు.గోథార్డ్ తన ఇంటిలోని పూజా మందిరంలో హిందూ దేవతలకు ఆస్ట్రియన్ స్వీట్లను సమర్పించే ఫోటోలను తరచుగా షేర్ చేస్తుంది.

ఆమె సమర్పించే వాటిలో పేస్ట్రీలు, పండ్లు, సాంప్రదాయ ఆస్ట్రియన్ డెజర్ట్‌లు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube