బైకులు, కార్లు, బంగారం పోతే దొంగతనం అనుకుంటాం.కానీ ఇక్కడ ఏకంగా రోడ్డు రోలర్‌నే ఎత్తుకెళ్లారు దొంగలు.
విస్తుపోతున్నారు కదూ, మహబూబాబాద్ జిల్లాలో జరిగిందీ షాకింగ్ ఘటన.రోడ్డు రోలర్‌ను దొంగిలించి ఏకంగా స్క్రాప్‌కు అమ్మేశారు అంటే నమ్మగలరు కేటుగాళ్లు అసలేం జరిగిందంటే, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంకు చెందిన బిక్షంరెడ్డి ( Biksham Reddy )అనే వ్యక్తి రోడ్డు రోలర్ యజమాని.తన రోలర్‌ను రైల్వే పనుల కోసం అంటూ కొందరు అద్దెకు తీసుకున్నారు.మహబూబాబాద్ ఫ్లైఓవర్ కింద రోలర్‌ను పార్క్ చేశారు.తీరా చూస్తే.రోలర్ మాయం.
బిక్షంరెడ్డి డ్రైవర్‌ను పంపించి చూడమని చెబితే అసలు విషయం బయటపడింది.రోడ్డు రోలర్ అక్కడ లేదు.

ఇంతలో నాగ్‌పూర్‌కు( Nagpur ) చెందిన మోహన్ మిశ్రా( Mohan Mishra ) అనే వ్యక్తి మహబూబాబాద్‌లోని స్క్రాప్ డీలర్ బడేమియా షాపుకు వెళ్లాడు.రోడ్డు రోలర్ పాడైపోయిందని, చూడమని అడిగాడు.బడేమియా, అతని కొడుకులు ఖాదర్, కరీం వెళ్లి చూసి, జేసీబీతో దాన్ని షాపుకు తరలించారు.మోహన్ మిశ్రా తాను సెంట్రల్ రైల్వేలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తానని, ఇలాంటి స్క్రాప్ అమ్ముతుంటానని నమ్మించాడు.అంతే, రూ.2.19 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు.డబ్బులు తీసుకుని, ఫ్యూచర్ లో కాంటాక్ట్ కోసం మిస్డ్ కాల్ ఇచ్చి ఊడాయించాడు.

మరుసటి రోజు బిక్షంరెడ్డి స్క్రాప్ షాపుకు ఫోన్ చేసి రోడ్డు రోలర్ తనదేనని చెప్పాడు.దాంతో స్క్రాప్ షాపు యజమానులు షాక్ అయ్యారు.దొంగిలించిన రోలర్‌ను కొనుక్కున్నామని లబోదిబోమన్నారు.తాము మోసపోయామని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.మోహన్ మిశ్రా రోడ్డు రోలర్‌ను తోస్తున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులకు చూపించారు.మహబూబాబాద్ టౌన్ సీఐ పి.దేవేందర్ కేసు నమోదు చేశామని తెలిపారు.దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







