సాధారణంగా సినిమా షూటింగ్ అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్నది.అలాంటిది స్టార్ హీరోల సినిమాల షూటింగ్ అంటే ఇంకా ఎంత ఖర్చు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
భారీగా జూనియర్ ఆర్టిస్టులు వందల్లో టెక్నీషియన్లు దర్శకులు వారి టీమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇక పెద్ద హీరోల సినిమాలకు పని చేస్తూ ఉంటారు అని చెప్పాలి.అందుకే ఒక్క రోజు షూటింగ్ ఆగిపోయిన కూడా నిర్మాతలకు లక్షల్లో నష్టం వాటిల్లుతోంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి భారీ క్రేజ్ ఉన్న హీరోలతో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి ప్రతి రోజు షూటింగ్ కోసం 10 లక్షల వరకు ఖర్చు అవుతుందట.ఈ క్రమంలోనే ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా హరిహర వీరమల్లు సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతుంది ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో ఎంతో బిజీగానే ఉన్నారు.ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ క్యాన్సల్ చేయాల్సి వచ్చింది.దీంతో ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎం ఎం రత్నం కి సరికొత్త ఇబ్బందులు వచ్చి పడ్డాయి అని తెలుస్తోంది.
అయితే భీమ్లా నాయక్ సినిమా కి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా మధ్యలో పవన్ సన్నిహితుడు అయిన దర్శకుడు త్రివిక్రమ్ ఉండడంతో ఇక పవన్ డేట్లు సర్దుబాటు చేయగలిగారు.దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
ఇప్పుడు ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా పర్యటనకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్.దీంతో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా అటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షెడ్యూల్ క్యాన్సల్ అవుతున్నాయట.
దీంతో నిర్మాత రత్నం కు బాగానే లాస్ వస్తున్నట్లు తెలుస్తోంది.