1.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న 21 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.
2.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3.ఏపీలో జాతీయ లోక్ అదాలత్
ఏపీలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.ఈ లోక్ అదాలత్ లో మొత్తం 94,263 కేసులు నమోదు అయ్యాయి.
4.పెద్ద పులి సంచారం
మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ డివిజన్ పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.సమీప ప్రాంతాల్లో ని పశువుల పై దాడికి పాల్పడడం తో భయాందోళనలు చెందుతున్నారు.
5.రాష్ట్రపతి ప్రసంగం

76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
6.లోకేష్ పర్యటన

జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు విశాఖలో పర్యటించనున్నారు.
7.అనంతపురంలో గోరంట్ల మాధవ్ పర్యటన
అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నేడు నియోజకవర్గంకు రానున్న నేపథ్యంలో ఆయనకు భారీగా స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేశారు.
8.6వ రోజుకి చేరిన పాదయాత్ర

సీఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆజాదిక గౌరవ్ యాత్ర నేటికీ ఆరో రోజుకు చేరుకుంది.
9.ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం
40 లక్షల వ్యయంతో హిందూపురం నియోజకవర్గ ప్రజలకుఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం ను అందుబాటులోకి నందమూరి బాలకృష్ణ తీసుకురానున్నారు.
10.మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులపై రఘునందన్ కామెంట్స్
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బహిరంగ ప్రదేశంలో కాల్పులు జరపడం బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు.ఏ చట్టం మంత్రి కాల్పులు జరిపేందుకు అనుమతించింది అని రావు ప్రశ్నించారు.
11.ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది.తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళకు స్వైన్ ఫ్లూ గా వైద్యులు నిర్ధారించారు.
12.యాదద్రి లో భక్తుల రద్దీ
ఆదివారం భోజనం కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ బాగా పెరిగింది.
13.ట్రైకార్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ
ట్రైకార్ చైర్మన్ గా ఇస్లవత్ రామ్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు.
14.పవన్ కళ్యాణ్ పాదయాత్ర

అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపడతారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
15.జర్నలిస్టుల సమస్యలపై జగన్ కు లేఖ
జర్నలిస్ట్ ల సమస్యలపై జగన్ కు టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ లేఖ రాశారు.
16.గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ కాంక్షలు
రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాలు ట్రాఫిక్ కాంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ ప్రకటించారు.
17.ఏపీ లో ఉక్కు సత్యగ్రహ దీక్ష ప్రారంభం
విశాఖలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరణ ను నిరసిస్తూ, కుర్మన్నపలెం లో రోజులపాటు ముక్కు సత్యాగ్రహ దీక్ష ను స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు దీక్ష ప్రారంభించారు.

18.బైక్ నుంచి జారిపడిన స్వామి గౌడ్
బిజెపి నేత స్వామి గౌడ్ బైక్ పై నుంచి జారీ కింద పడ్డారు.ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం గండిపేట మండలంలో నిర్వహించిన బైక్ ర్యాలీ లో పాల్గొన్న స్వామి గౌడ్ బైక్ నుంచి జారి కింద పడిపోయారు.
19.బీఎస్ ఎన్ ఎల్ లో అప్రంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీ

బిఎస్ఎన్ఎల్ లో కర్ణాటక సర్కిల్ లో పలు అప్రంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,150
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,530
.