తిరుమలలో శుక్రవారం శ్రీవారికి ఏ ప్రసాదం నివేదిస్తారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఒకటి.ఈ ప్రముఖ పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.

 Do You Know What Prasadam Is Offered To Tirumala Sri Venkateswara Swamy On Frida-TeluguStop.com

తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు ఒక్కోరకమైన ప్రసాదాలను తయారు చేసి శ్రీవారికి నివేదిస్తూ ఉంటారు.గురువారం రోజున దాదాపు 50 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇంకా చెప్పాలంటే 16,000 మంది తలనీలాలను సమర్పించారు.భక్తుల ద్వారా హుండీ కానుకల రూపంలో దాదాపు మూడున్నర కోట్లు సమర్పించారు.

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకారాలు నిర్వహించారు.శుక్రవారం ప్రత్యూష కాల ఆరాధనతో ఆలయ ద్వారలు తెరిచిన అర్చకులు బంగారు వాకిలి వద్ద ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి రచించిన పాసురాళ్ళను జీయ్యంగార్లు పఠీoచారు.

ఆ తరువాత ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవలను ఆ దేవాలయ అర్చకులు శాస్త్రోక్తంగా చేశారు.అంతేకాకుండా తోమాల అర్చన సేవలను అర్చకులు నిర్వహించారు.

Telugu Bakti, Devotional, Prasadam, Srimalayappa, Srivenkateswara, Tirumala-Late

శ్రీవారికి పంచాంగ శ్రవణం హుండీ జనాకర్షణ విన్నవించి బెల్లంతో కలిపిన నువ్వుల పిండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.సమర్పించిన తర్వాత శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి పవళింపజేశారు.ఇంకా చెప్పాలంటే బెల్లం, పూర్ణం, బోండాలు పోలీల శుక్రవారం ప్రత్యేకంగా స్వామివారికి నివేదిస్తారు.ఇక వీటితో పాటు అన్న ప్రసాదం, లడ్డు, వడలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు.

Telugu Bakti, Devotional, Prasadam, Srimalayappa, Srivenkateswara, Tirumala-Late

సన్నిధిలో శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన తర్వాత సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం అర్చకులు కల్పిస్తారు.ఆ తర్వాత స్వామివారికి రెండవ గంట నివేదన బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతినిస్తారు.శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మాలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రకారములోనికి పవళింపజేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణం నేత్రపర్వంగా అర్చకులు నిర్వహిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube