ప్రస్తుత కాలంలో చాలా రకాల పాన్ లు అందుబాటులో ఉన్నాయి.వీటిలో స్వీట్ పాన్( Sweet pan ) స్పైసీ పాన్ ముఖ్యమైనవి అని దాదాపు చాలా మందికి తెలుసు.
కొన్ని ప్రాంతాలలో సంబంధించిన నగరం పేరు ఆధారంగా కూడా పాన్ చాలా ప్రసిద్ధి చెంది ఉంది.తమలపాకులు కాయలతో పాటు సున్నం, పొగాకు తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది.
కానీ పొగాకు ఆరోగ్యానికి మంచిది కాదు.సున్నం కూడా తినకూడదని చెబుతూ ఉంటారు.
సున్నం పొగాకు లేకుండా స్వీట్ పాన్ తినవచ్చు.మరి ఈ పాన్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం తర్వాత పాన్ తినడానికి అనేక కారణాలు ఉన్నాయి.ముందుగా ఇది జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఉబ్బిన కడుపు, తీవ్రమైన మలబద్ధకం ( Constipation problems )సమస్యలు ఉన్నవారు కూడా పాన్ తినవచ్చు.ఇది మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది.అంతే కాకుండా తమలపాకులలో రిబోఫ్లావిన్, క్యాల్షియం, విటమిన్ సి, కెరోటిన్లు ఎక్కువగా ఉంటాయి.స్టీల్ రేంజ్ రేకులు, లవంగాలు, వాల్‌నట్ పాన్ లో కూడా వివిధ పోషకాలు ఉంటాయి.
దీనివల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.తమలపాకు జీర్ణ క్రియకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.
మీకు కడుపునొప్పి( Stomach ache ) వల్ల అనేక సమస్యలు ఉంటే భోజనం తర్వాత పాన్ తినడం అలవాటు చేసుకోవాలి.

ఈ విధంగా పాన్ తింటే లాలాజల రసం ఏర్పడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.తలనొప్పిగా ఉన్నప్పుడు తమలపాకు నుదుటిపై రాసుకుంటే తలనొప్పి ( Headache )తగ్గిపోతుంది.అలాగే పాన్ తినేటప్పుడు గులాబీ రేకులు, తురిమిన కొబ్బరి కూడా కూలింగ్ ఏజెంట్గా పని చేస్తాయి.
మీ తలనొప్పిని తగ్గించడంలో ఇవి ఎంతగానో పనిచేస్తాయి.ఇంకా చెప్పాలంటే శరీరంలో కొవ్వు తగ్గడం అనేది చాలామందికి ఒక సవాలుగా మారి ఉంటుంది.
తమలపాకు అధిక బరువును కూడా తగ్గిస్తుంది.తమలపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
ఇవి నోటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.