చాలా మంది సిల్కీ అండ్ షైనీ హెయిర్( Silky and shiny hair ) ను కోరుకుంటూ ఉంటారు.అటువంటి జుట్టును పొందడం కోసం రకరకాల కేశ ఉత్పత్తులను వాడుతుంటారు.
సెలూన్ కు వెళ్లి పలు హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకును( Aloe vera leaf ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా బాయిల్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) మరియు ఒక కప్పు గులాబీ రేకులు( rose petals ) వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.దాంతో వాటర్ అనేది జెల్లీగా మారుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ), వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేశారంటే సహజంగానే మీ కురులు సిల్కీ గా షైనీగా మారతాయి.అంతేకాకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల జుట్టు రాలే సమస్య దూరం అవుతుంది.జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా మారతాయి.హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది.డ్రై హెయిర్ సమస్య నుంచి కూడా విముక్తి పొందొచ్చు.