మానవ జీవితంలో మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మనిషి శరీరంలోని ప్రతి భాగం సరిగా పనిచేయడం, శరీరంలోని హార్మోన్ల స్థాయి సరిగా ఉండడం ఎంతో ముఖ్యం.మన శరీరంలో అనేక రకాల హార్మోన్లు ప్రతి రోజు ఉత్పత్తి అవుతూ ఉంటాయి.
ఈ హార్మోన్ల వేరువేరు విధులను కలిగి ఉంటాయి.హార్మోన్లలో ఆటంకాల కారణంగా మనం అనేక తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
హార్మోన్లలో ఆటంకాలు, మూడు స్వింగ్స్,నిద్ర విధానాలలో మార్పులు, జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు, అన్నివేళలా అలసిపోవడం, తలనొప్పి లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇదే కాకుండా కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా హార్మోన్ల ఆటంకాల కు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు.మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా హార్మోన్లలో ఆటంకాలను సరి చేసుకోవచ్చు.హార్మోన్ల అసమతుల్యతను సరి చేయడంలో ఎంతో సహాయపడే కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హార్మోన్ల అసమతుల్యత తో బాధపడేవారు క్యాబేజీని తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడానికి ఇది చాలా మేలు చేస్తుంది.క్యాబేజీలో అనేక మూలకాలు, సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి శరీరంలోని హార్మోన్ల స్థాయిని నిర్వహించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
సలాడ్లు, కూరగాయలు కాకుండా మీరు క్యాబేజీని అనేక ఇతర ఆహార పదార్థాలుగా ఉపయోగించవచ్చు.బ్రొకోలీ హార్మోన్లలో అసమతుల్యత వదిలించుకోవడానికి మీరు ఆహారంలోని చేర్చుకోవచ్చు.శరీరంలోని ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా తక్కువగా ఉన్న వారికి బ్రొకోలీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అంతే కాకుండా బ్రోకలీ తీసుకోవడం వల్ల శరీరంలోని హర్మన్ల స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే బీట్ రూట్ లో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
హార్మోన్ అసమతుల్యత సమస్యలకు బీట్ రూట్ తీసుకోవడం ఎంతో మంచిది.మీరు బీట్ రూట్ ను సలాడ్లు కూరగాయల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు.
హార్మోన్ల అసమతుల్యత ను నివారించడానికి బీట్ రూట్ క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.