వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే మీ హెయిర్ సూపర్ లాంగ్ గా మారడం గ్యారంటీ!

ఇటీవల కాలంలో చాలా మంది అమ్మాయిలు ఫ్యాషన్ పేరుతో జుట్టును కత్తిరించేసుకుంటున్నారు.పొడవాటి జుట్టు అమ్మాయిలు కనపడటమే గగనం అయిపోయింది.

 Using This Oil Will Make Your Hair Long! Long Hair, Hair Care, Hair Oil, Hair Gr-TeluguStop.com

అయితే కొందరికి తమ జుట్టును పొడుగ్గా పెంచుకోవాలనే కోరిక ఉంటుంది.కానీ సరైన గ్రోత్ లేకపోవడం వల్ల లాంగ్ హెయిర్ పొందలేకపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఆయిల్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే మీ హెయిర్ సూపర్ లాంగ్ గా మారడం గ్యారంటీ.మరి ఇంతకీ ఆ ఆయిల్ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Tips, Oil, Healthy, Latest, Long-Telugu Health

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) మరియు నాలుగు రెబ్బలు కరివేపాకు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె ( Coconut Oil )పోసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు, మెంతులు, కరివేపాకు మిశ్రమాన్ని కూడా వేసి చిన్న మంటపై దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Care, Care Tips, Tips, Oil, Healthy, Latest, Long-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఒక బాటిల్ లో ఆయిల్ ను స్టోర్ చేసుకోవాలి.ఇక ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల అనంత‌రం లేదా మరుసటి రోజు తేలికపాటి షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే హెయిర్ గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.ఒత్తుగా మారుతుంది.జుట్టు రాలడం త‌గ్గు ముఖం పడుతుంది.

అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల వైట్ హెయిర్ సమస్య దరిచేరకుండా ఉంటుంది.కురులు నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి.

కాబట్టి లాంగ్ హెయిర్ ను కోరుకుంటున్న వారు తప్పకుండా ఈ మిరాకిల్ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube