ఈ ఆయుర్వేద మూలికలతో కీళ్లనొప్పులు ఇట్టే మాయం..

ఈ మధ్య చాలా మంది యూరిక్ యాసిడ్ వల్ల చాలా బాధ పడుతున్నారు.అయితే యూరిక్ యాసిడ్ ఏర్పడటం అనేది అసహజమైన ఆహారం తీసుకోవడం వల్ల మొదలవుతుంది.

 Ayurvedic Solution To Reduce Knee Pains Details, Ayurvedic Solution ,reduce Knee-TeluguStop.com

ఆహారంలో ప్యూరిన్ ఆహారాలు తీసుకోవడం, అధిక బరువు, మధుమేహ వ్యాధి, మూత్రవిసర్జన మాత్రలు తీసుకోవడం, ఎక్కువ మద్యం సేవించడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతుంది.

అయితే శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను మూత్రపిండం తొలగించలేనప్పుడు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.

మన శరీరంలో టాక్సిన్స్ పెరగడం వల్ల కీళ్లలో పేరుకుపోవడం మొదలవుతుంది.శరీరంలో ఈ విషపదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు, అవి స్ఫటికాల రూపంలో శరీరంలోని కీళ్లలో చేరి నొప్పిని కలిగిస్తాయి.

యూరిక్ యాసిడ్ పెరుగుదల వల్ల చేతులు, కాళ్ళ కీళ్ళలో నొప్పి ప్రారంభమవుతుంది.యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటే ఈ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.అయితే కొన్ని మూలికలు యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.యూరిక్ యాసిడ్‌ను వేగంగా నియంత్రించే ఆయుర్వేద మూలికలలో గుడుచి అలాగే తిప్పతీగ.

ఈ మూలికను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అయితే తీప్పతీగని గిలోయ్ అని కూడా అంటారు.శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ హెర్బ్ చాలా బాగా పనిచేస్తుంది.అదే విధంగా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడంతో పాటు యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ చేస్తుంది.

అలాగే గుడుచి కూడా కీళ్ల నొప్పుల నివారణకు ఉపయోగపడుతుంది.గుడుచి తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ వేగంగా నియంత్రించబడుతుంది.

ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.అందువల్ల గుడుచి యూరిక్ యాసిడ్ లక్షణాలను తగ్గిస్తుంది.

అయితే యూరిక్ యాసిడ్ నియంత్రణకు గుడుచి ఆకులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఆ నీళ్లను ఉదయాన్నే సగం వరకు ఉడికించాలి.ఈ నీటిని ఫిల్టర్ చేసి తర్వాత తాగాలి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటుంది.అలాగే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube