నాజూకైన నడుము కావాలని అందరూ కోరుకుంటారు.కానీ, ఇటీవల రోజుల్లో ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, పలు రకాల మందుల వాడకం, ఒకే చోట గంటలు తరబడి కూర్చోవడం, ఒత్తిడి, వ్యాయామాలు చేయకపోవడం వంటి కారణాల వల్ల నడుము చుట్టూ కొవ్వు చక్కగా పేరుకుపోతుంటుంది.
ఫలితంగా బట్టలు పట్టక పోవడమే కాదు.శరీర ఆకృతి సైతం అందవిహీనంగా తయారు అవుతుంది.
దాంతో ఏం చేయాలో తెలియక, మళ్లీ నడుమును ఎలా సన్నగా మార్చుకోవాలో అర్థంగాక తెగ సతమతం అయిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పొడిని రోజూ తీసుకుంటే నెల రోజుల్లోనే నడుమును మల్లెతీగలా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం నడుం కొవ్వును కరిగించే ఆ పొడి ఏంటో.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.? చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అవిసె గింజలను వేసి రెండంటే రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్రై చేసుకున్న అవిసెగింజలు, రెండు లేదా మూడు శింఠి కొమ్ములు, రెండు పసుపు కొమ్ములు మరియు ఒక దాల్చిన చెక్క వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఆ తర్వాత ఈ పొడిని ఒక గాజు సీసాలో నింపుకుంటే దాదాపు ముప్పై రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఇక ఈ పొడిని ఎలా వాడాలో కూడా చూసేయండి.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో అర స్పూన్ తయారు చేసుకుని పొడిని కలిపి ఉదయాన్నే సేవించాలి.ఇలా ప్రతి రోజు ఉదయాన్నే చేస్తే గనుక.నెల రోజుల్లోనే నడుము చుట్టు ఏర్పడిన కొవ్వు క్రమంగా కరిగి నాజూగ్గా తయారు అవుతుంది.అంతే కాదు, ఈ పొడిని రోజూ తీసుకుంటే రోగ నిరోశక శక్తి రెట్టింపు అవుతుంది.కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరియు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.