ఫేర్‌వెల్‌లో నవ్వుతూ మాట్లాడుతూనే కుప్పకూలిన స్టూడెంట్.. సెకన్లలో విషాదం.. లైవ్ వీడియో వైరల్!

మహారాష్ట్రలో( Maharashtra ) గుండెలు పిండేసే విషాదం చోటు చేసుకుంది.కాలేజ్ ఫేర్‌వెల్‌లో( College Farewell ) అప్పటిదాకా నవ్వుతూ, జోకులు వేస్తూ సందడి చేసిన ఓ స్టూడెంట్, ఒక్క సెకనులో కుప్పకూలిపోయింది.

 Student Collapses And Dies While Giving Speech At College Farewell Video Viral D-TeluguStop.com

ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే కన్నీరు ఆగదు.వర్షా ఖరత్( Varsha Kharat ) అనే ఆ అమ్మాయి ధారాశివ్ జిల్లాలోని పారండాలోని ఆర్జీ షిండే కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

ఏప్రిల్ 3న ఫేర్‌వెల్ పార్టీలో స్పీచ్ ఇస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.ఆ తరువాత కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచింది.

వైరల్ వీడియోలో( Viral Video ) వర్షా స్పీచ్ అదిరిపోతోంది.అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ నవ్విస్తూ జోకులు వేస్తూ స్టేజ్ మీద దుమ్ములేపుతోంది.సరిగ్గా మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఒక్కసారిగా నీరసంగా అనిపించి కుప్పకూలిపోయింది.అప్పటిదాకా హాయిగా నవ్వుతూ మాట్లాడిన వర్ష ఒక్కసారిగా అలా పడిపోవడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు.

రెండు నిమిషాల షార్ట్ స్పీచ్‌లో తన మాటలతో అందరినీ కడుపుబ్బా నవ్వించింది.కానీ ఆ తరువాత సీన్ చూసి అందరూ గుండెలు పట్టుకున్నారు.

వెంటనే కాలేజ్ స్టాఫ్, స్టూడెంట్స్ కలిసి వర్షాని హుటాహుటిన దగ్గరలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.డాక్టర్లు వర్షా చనిపోయినట్టు నిర్ధారించారు.ఫేర్‌వెల్ పార్టీలో అప్పటిదాకా సందడిగా ఉన్న మూడ్ ఒక్కసారిగా విషాదంలోకి మారిపోయింది.వర్ష కుప్పకూలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియో చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఆ తరువాత తెలిసిన నిజం మరింత కలిచివేసింది.వర్షకి గుండె సమస్యలు ఉన్నాయని తెలిసింది.ఆమెకు ఏడేళ్ల క్రితమే బైపాస్ సర్జరీ కూడా జరిగిందట.అప్పటినుంచి రెగ్యులర్‌గా మందులు వాడుతోంది.కానీ ఫేర్‌వెల్ హడావిడిలో ఆ రోజు మాత్రం మందులు వేసుకోవడం మర్చిపోయిందట పాపం.వర్ష వాళ్ల అంకుల్ ధనాజీ ఖరత్ జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు.

ఆయన ఈ విషయాలన్నీ చెప్పారు.

వర్ష చదువులో చాలా యాక్టివ్ అని కాలేజ్ స్టాఫ్ చెబుతున్నారు.

పేద కుటుంబం నుంచి వచ్చింది.వాళ్ల పేరెంట్స్ వ్యవసాయ కూలీలు.

తమ్ముడు, అక్క ఉన్నారు.వర్షకి చాలా డ్రీమ్స్ ఉండేవి.

లైఫ్‌లో ఏదో ఒకటి సాధించాలని తపన పడేది.

వర్ష మరణంతో కాలేజ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది.

సోషల్ మీడియాలో చాలామంది వర్షకి నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.ఇంత చిన్న వయసులో వర్ష చనిపోవడం నిజంగా చాలా బాధాకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube