వేస‌విలో రాగి చ‌పాతీ ఆరోగ్యానికి మేలోయి?

వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్ మరియు హెల్త్ పై ప్రత్యేకమైన శ్రద్ధతో చాలామంది రైస్ కు బదులుగా గోధుమ చపాతీ తింటుంటారు.అయితే ప్రస్తుత వేసవి కాలంలో గోధుమ చపాతీకి బదులుగా రాగి చపాతీని( Ragi Chapathi ) డైట్ లో చేర్చుకోండి.

 Ragi Chapathi Are Good For Health In Summer Details, Ragi Chapathi, Ragi Chapat-TeluguStop.com

ఆరోగ్యపరంగా రాగి చపాతీ ఎంతో మేలు చేసే ఆహారంగా పరిగ‌నించబడుతుంది.స‌మ్మ‌ర్ లోనే స‌హ‌జంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

రాగి చ‌పాతీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.

రాగి చ‌పాతీలో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉన్నందున బరువు నియంత్రణకు అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.వేస‌విలో వేధించే నీర‌సాన్ని( Fatigue ) త‌రిమికొట్ట‌డంలోనూ తోడ్ప‌డ‌తాయి.అలాగే రాగి చ‌పాతీలో ఉన్న ఎలక్ట్రోలైట్లు వేసవి వేడికి కారణంగా వచ్చే డీహైడ్రేషన్‌ను( Dehydration ) కొంతవరకు కంట్రోల్ చేస్తాయి.మ‌ధుమేహం ఉన్న‌వారికి రాగి చ‌పాతీలు చాలా మంచివి.

రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించ‌గ‌ల‌వు.

Telugu Fatigue, Finger Millets, Tips, Ragi Chapathi, Ragichapathi, Ragi Roti, Su

రాగిలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది.అనీమియా ఉన్నవారు రాగి చ‌పాతీ తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.ర‌క్త‌హీన‌త దూరం అవుతుంది.

రాగి చ‌పాతీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఎముకల దృఢత్వానికి కాల్షియం ఎంతో అవసరం.రాగి గ్లూటెన్-ఫ్రీ కాబట్టి, గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారు కూడా రాగి చ‌పాతీల‌ను త‌మ డైట్ లో చేర్చుకోవ‌చ్చు.

Telugu Fatigue, Finger Millets, Tips, Ragi Chapathi, Ragichapathi, Ragi Roti, Su

అంతేకాదండోయ్‌.రాగి చ‌పాతీల్లో ఫైబ‌ర్‌ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో సహాయపడుతుంది.ఇక రాగి చ‌పాతీలు తేలికగా జీర్ణమవుతాయి.పైగా తిన్న తర్వాత ఎక్కువసేపు క‌డుపు నిండిన ఫీలింగ్ ను అందిస్తాయి.దాంతో అతిగా తిన‌డం కూడా త‌గ్గిస్తారు.రోజువారీ ఆహారంలో రాగి చ‌పాతీల‌ను చేర్చుకోవ‌డం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

పొట్ట నిండిన ఫీలింగ్ ఇవ్వడమే కాకుండా, అనేక పోషకాలతో శరీరాన్ని బలపరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube