ఇటీవల కాలంలో మేకప్ అనేది చాలా మందికి డైలీ రొటీన్ లో భాగం అయిపోయింది.మేకప్ లేకుండా బయట కాలు కూడా పెట్టడం లేదు.
కానీ మేకప్ వేసుకోవడానికి వాడే చర్మ ఉత్పత్తుల్లో అనేక రకాల కెమికల్స్ నిండి ఉంటాయి.అవి చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.
భవిష్యత్తులో వివిధ చర్మ సమస్యలకు దారి తీస్తాయి.అందుకే సహజంగానే చర్మాన్ని అందంగా మెరిపించుకునేందుకు ప్రయత్నించాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది.ఈ రెమెడీని పాటిస్తే మేకప్ అక్కర్లేదు.
సహజంగానే వైడ్ అండ్ గ్లోయింగ్ గా మెరిసిపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక క్యారెట్ తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ వేసుకోవాలి.అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు క్యారెట్ జ్యూస్( Carrot juice ), వన్ టేబుల్ స్పూన్ల పెరుగు( curd ), హాఫ్ టేబుల్ స్పూన్ తేనె( honey ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ ఫేస్ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.అదే సమయంలో మరెన్నో లాభాలను చేకూరుస్తుంది.క్యారెట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్ ( Antioxidants, beta carotene )చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది.క్యారెట్‌లోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా తెల్లగా, కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

అలాగే ఎగ్ వైట్ లో ఉండే ప్రోటీన్లు చర్మాన్ని బిగుతుగా, మృదువుగా మారుస్తాయి.ముడతలు, చారలు వంటి ఏజింగ్ లక్షణాలకు అడ్డుకట్ట వేస్తాయి.పెరుగులో సహజమైన కొవ్వులు, ప్రోటీన్లు మరియు విటమిన్లు అధికంగా ఉంటాయి.అందువల్ల పెరుగు ముఖ చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా మారుతుంది.ఇక తేనె చర్మానికి మంచి గ్లోను అందిస్తుంది.తేనెలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అకాల వృద్ధాప్యానికి చెక్ పెడతాయి.







