1.రాహుల్ యాత్ర పై షర్మిల కామెంట్స్
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జూడో యాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
2.కోమటిరెడ్డి నమ్మకద్రోహం చేసేలా మాట్లాడారు : పాల్వాయి స్రవంతి
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కు ద్రోహం చేసేలా మాట్లాడారని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విమర్శించారు.
3.డిసెంబర్ ఒకటి నుంచి పిహెచ్ డి ప్రవేశ పరీక్షలు
డిసెంబరు ఒకటో తేదీ నుంచి పీహెచ్ డి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
4.డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు పై ఆందోళన
ఎల్ కే జీ విద్యార్థిని పై అత్యాచార ఘటనలో డిఎన్ఏ స్కూల్ గుర్తింపును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
5.మునుగోడులో కాంగ్రెస్ గెలవదు : వెంకటరెడ్డి
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
7.పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని నోటీసులు ఇచ్చింది.
8.మంత్రులకు దమ్ముంటే రాజీనామా చేయాలి
ఏపీ మంత్రులకు దమ్ముంటే రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్ చేశారు.
9.ఇస్రో చైర్మన్ పూజలు
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట లో ఉన్న శ్రీ చెంగళమ్మ దేవాలయం లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
10.శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్టుకు 10 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
11.జూనియర్ డాక్టర్ల వేతనాలు పెంపు
ఏపీలో జూనియర్ డాక్టర్లకు 15 శాతం జీతాలు పెంచుతూ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
12.కరెన్సీ నోట్లపై నేతాజీ బొమ్మ ముద్రించాలి
భారత కరెన్సీ పై నేతాజీ బొమ్మ ముద్రించాలని హిందూ మహాసభ డిమాండ్ చేసింది.
13.ఉరుసు మహోత్సవం
చీరాల వైకుంఠపురం దర్గాలో మూడు రోజులు పాటు ఉరుసు మహోత్సవం నిర్వహించనున్నారు.
14.ఏపీ పీసెట్ ఆన్లైన్ పరీక్షలు
ఏపీ పీ సెట్ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఆన్ లైన్ గడువు నేటితో ముగియనుంది.
15.నేటితో ముగియనున్న జాతర
నేటితో గురజాల లోని ముత్యాలమ్మ జాతర ముగియనుంది.
16 పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన
ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు.
17.రాష్ట్రస్థాయి మహిళా చెస్ టోర్నమెంట్ పోటీలు
విజయవాడ చెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేడు, రేపు రాష్ట్రస్థాయి మహిళా చెస్ టోర్నమెంట్ పోటీలు జరగనున్నాయి.
18.క్యాన్సర్ పై అవగాహన నడక
నెక్లెస్ రోడ్డులోని జల విహార్ వద్ద ఎం ఎం జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన నడకను ప్రారంభించారు.
19.ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం
ఏపీ కి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ వ్యాఖ్యానించారు.
20.మహా పాదయాత్ర ను అడ్డుకున్న పోలీసులు
అమరావతి మహా పాదయాత్ర ను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.ఐడీ కార్డులు ఉన్న వారిని మాత్రమే అనుమతి ఇస్తామంటూ తేల్చి చెప్పారు.దీంతో పాదయాత్రను మూడు రోజుల పాటు వాయిదా వేశారు.