నటి ఐశ్వర్య రాజేష్ అందరికి సుపరిచితురాలే.కౌసల్య కృష్ణముర్తి సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందింది.
ఐశ్వర్య పుట్టింది పెరిగింది అంతా చెన్నై లోనే.మన తెలుగు అమ్మాయి ఐశ్వర్య తమిళంలో 25 సినిమాలు దాక నటించింది.
రెండు మలయాళం సినిమాలు, ఒక హిందీ సినిమా కూడా చేసింది.అయితే ఐశ్వర్య చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది .వాళ్ళ నాన్న గారు కూడా మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడే.ఆయన మరెవరో కాదు ప్రముఖ నటుడు రాజేష్ .దాదాపు తెలుగులో 45 సినిమాలు దాక చేసాడు.మల్లెమొగ్గ, రెండు జడల సీత, అలజడి లాంటి ఎన్నో మంచి సినిమాలు చేసారు .అలాగే ఐశ్వర్య వాళ్ళ అత్త కూడా మన అందరికి తెలిసిన ఆవిడే.తన నటనతో హాస్యంతో మన అందరిని నవ్వించే కమెడియన్ శ్రీదేవి గారు.
నటుడు రాజేష్ కి స్వయానా అక్క అవుతుంది శ్రీలక్ష్మి.ఆమె 500 కి పైగా చిత్రాలలో నటించారు.
అలాగే అమర్ నాథ్ గారు ఐశ్వర్య కి తాతగారు అవుతారు.ఇలా కుటుంభ సభ్యులు అందరు కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవారే అవ్వడం విశేషం అని చెప్పాలి.
ఐశ్వర్య 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి రాజేష్ చనిపోయారు.ఆ తరవాత తనతోపాటు నలుగురు సంతానాన్ని తల్లి ఎంతో కష్టపడి పోషించారట.పెద్దగా చదువుకోని తన తల్లి తమను పెంచడానికి చాలా కష్టపడ్డారట.ఐశ్వర్యకు ముగ్గురు అన్నయ్యలు.
అందులో ఇద్దరు అన్నయ్యలు చనిపోయారు.కానీ తెలుగులో మాత్రం నటించడానికి ఆసక్తి చూపలేదు ఎందుకంటే ఐశ్వర్య తెలుగులో నటించడానికి మంచి పాత్ర కోసం వేచి చూడడం వలనే తెలుగు ఇండస్ట్రీకి రావడానికి సమయం పట్టిందట.
అలా ఐశ్వర్య రాజేష్ తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో నటించింది.తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తుంది.
అలాగే విజయ్ దేవరకొండతో ” ది వరల్డ్ ఫేమస్ లవర్ “ సినిమాలో ఒక హీరోయిన్ పాత్రలో కూడా నటించింది.మన అందరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే.ఐశ్వర్య చిన్నప్పుడే బాల నటిగా తెలుగు సినిమాలో నటించింది.రాంబంటు సినిమాలో రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించింది.ఆ సినిమాలో ఒక పాటలో ఐశ్వర్య మనకి బాల నటిగా కనిపిస్తుంది.
ఒక పాట మధ్యలో ఒక చిన్న పిల్ల వచ్చి రాజేంద్ర ప్రసాద్ ని ముద్దు పెట్టుకునే సీన్ లో నటించింది ఐశ్వర్య.అప్పట్లో ఆ షాట్ తీయడానికి దాదాపు పదిహేను టేక్స్ తీసుకుందట.ఎందుకంటే రాజేంద్రప్రసాద్ ని ముద్దుపెట్టుకుని వెంటనే తన పెదవి చేతితో తుడిచేసుకునేదట.
ఇలా చాలా సార్లు చేసిందట.దీనికి రాజేంద్రప్రసాద్ చిన్న పిల్ల అయిన ఐశ్వర్య ను నవ్వుతు ఏంటి పిల్లా … నన్ను ముద్దుపెట్టుకుని తుడిచేసుకుంటున్నావ్ అని అన్నారట.
దాదాపు 15 సార్లు అలానే చేసిందట.తరువాత ఎప్పటికో ఆ సీన్ ఓకే చేశారట.
ఐశ్వర్య వాళ్ళ నాన్న రాజేష్ కి రాజేంద్రప్రసాద్ మంచి స్నేహితుడు కూడా.మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఐశ్వర్య రాజేంద్రప్రసాద్ తో కలిసి కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో నటించింది.