ఎర్ర కందిప‌ప్పుతో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా..?

ఈ మ‌ధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఎర్ర కందిప‌ప్పు( red toor dal ).చాలా మంది మామూలు కందిప‌ప్పుకు బ‌దులుగా ఎర్ర కందిప‌ప్పు వాడుతుంటారు.

 Wonderful Health Benefits Of Masoor Dal! Masoor Dal, Masoor Dal Health Benefits,-TeluguStop.com

అస‌లు ఎర్ర కందిప‌ప్పు ప్ర‌త్యేక‌త ఏంటి.? అది ఎటువంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది.? వంటి విష‌యాలు ఈ ఆర్టిక‌ల్ లో తెలుసుకుందాం.

ఎర్ర కందిప‌ప్పును మసూర్ దాల్ అంటారు.

ఇది కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది.మామూలు కందిప‌ప్పును తూర్ దాల్ అని పిలుస్తారు.

ఇది లేత‌ ప‌సుపు రంగులో ఉంటుంది.సాంబారు, పప్పు కూరల కోసం మ‌న తెలుగువాళ్లు మామూలు కందిప‌ప్పును ఎక్కువగా వాడతారు.

ఉత్తర భారతదేశంలో ఎర్ర కందిప‌ప్పును ఎక్కువ‌గా వాడ‌తారు.మూములు కందిప‌ప్పు, ఎర్ర కందిప‌ప్పు రెండూ ఆరోగ్యానికి మంచివే.

కానీ పోష‌కాల ప‌రంగా, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల ప‌రంగా ఈ రెండు ప‌ప్పుల మ‌ధ్య కొంత వ్య‌త్యాసం ఉంటుంది.

Telugu Tips, Latest, Masoordal-Telugu Health

మామూలు కందిప‌ప్పులో ఫైబ‌ర్, ఐర‌న్‌ ( Fiber, Iron )మితంగా.ప్రోటీన్‌, ఫోలేట్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి.ఎర్ర కందిప‌ప్పులో ఫోలేట్, కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా.

ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటాయి.ర‌క్త‌హీన‌త ఉన్న‌వారికి ఎర్ర కందిప‌ప్పు మంచి ఆప్ష‌న్.

ఐరన్ అధికంగా ఉండ‌టం వ‌ల్ల ఎర్ర కందిప‌ప్పు హిమోగ్లోబిన్ పెంపునకు సహాయం చేస్తుంది.ర‌క్త‌హీన‌త‌, బలహీనతకు చెక్ పెడుతుంది.

Telugu Tips, Latest, Masoordal-Telugu Health

లో-ఫ్యాట్, లో-క్యాలరీ, హై ఫైబర్( Low-fat, low-calorie, high fiber ) మ‌రియు హై ప్రోటీన్ క‌లిగి ఉండ‌టం వ‌ల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఎర్ర‌కంది ప‌ప్పు అనుకూలంగా ఉంటుంది.కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చి.ఎక్కువ తినకుండా ఆప‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.అలాగే ఎర్ర కందిప‌ప్పు హృద‌య ఆరోగ్యానికి చాలా మంచిది.ఎర్ర కందిప‌ప్పు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తుంది.అందులోని పొటాషియం రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.

ఎర్ర కందిప‌ప్పులోని ఫైబ‌ర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుప‌రుస్తుంది.మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

ఎర్ర కందిపప్పులోని యాంటీఆక్సిడెంట్లు మ‌రియు విటమిన్లు చ‌ర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube