1.మతం మారిన వారికి రిజర్వేషన్లు రద్దు చేయాలి
మతం మారిన వారికి రిజర్వేషన్ రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి విజయశంకర్ తివారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2.నేడు అవనిగడ్డలో జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ ఈరోజు కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు.
3.సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సంబరాలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు.ప్రధాని ప్రతి ఏటా సైనికులతో దీపావళి పండుగను చేసుకుంటున్నారు.ఈ ఏడాది అదే విధంగా చేసుకోనున్నారు.
4.4045 దీపాంతాలతో కాళీమాత సైకత శిల్పం
దీపావళి సందర్భంగా ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ 4,045 దీపాలను ఉపయోగించి అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు
5.ఎస్సై కానిస్టేబుల్ ఫలితాలను రద్దు చేయాలి
పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించిన పిలిమినరీ పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రామారావు డిమాండ్ చేశారు.
6.రాహుల్ యాత్ర కు మూడు రోజులు బ్రేక్
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు నేటి నుంచి మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు .
7.జగన్ దీపావళి శుభాకాంక్షలు
దీపావళి ప్రతి ఇంట ఆనంద దీపావళి కావాలని ఏపీ సీఎం జగన్ ఆకాంక్షిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
8.జలదిగ్బంధంలోని వనదుర్గా ఆలయం
మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయలు ఆలయం వద్ద సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గడం లేదు.దీంతో ఏడుపాయల ఆలయం ముందు ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
9.నారా లోకేష్ శుభాకాంక్షలు
ప్రజలందరికీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
10.జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్
ఏపీలోని హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులో ఉన్న ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్ లు విడుదల చేస్తోంది.తాజాగా డ్రైవర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
11.కెసిఆర్ తో రాపోలు భేటీ త్వరలో టిఆర్ఎస్ లో చేరిక
బిజెపి నేత పద్మశాలి సంఘం నాయకుడు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ప్రగతి పవనులు కేసీఆర్ తో భేటీ అయ్యారు.త్వరలోనే ఆయన బిజెపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరనున్నారు.
12.రేపు చిన వెంకన్న ఆలయం మూసివేత
రేపు సూర్యగ్రహణం కారణంగా ద్వారకా తిరుమల వెంకన్న ఆలయాన్ని మూసివేయునన్నారు.
13.స్పీకర్ రాజీనామా చేయాలి
చట్టాలను గౌరవించని స్పీకర్ తమ్మినేని సీతారాం రాజీనామా చేయాలని , అమరావతి రాజధాని సాధన కోసం రైతులు చేస్తున్న మహా పాదయాత్ర పై స్పీకర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విమర్శించారు.
14.రేపు కొమరవెల్లి మల్లన్న ఆలయం మూసివేత
రేపు పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మూసివేయనున్నారు.
15.రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది ఒక్కరోజులోనే 6.30 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
16.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది శ్రీవారి దర్శనానికి దాదాపు 20 గంటలు సమయం పడుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 80, 565 మంది భక్తులు దర్శించుకున్నారు.
17.తీరం దాటనున్న తుఫాన్
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ చిత్రం కొనసాగుతోంది .ప్రస్తుతం సాగర్ దీపానికి 580 కిలోమీటర్ల దూరంలో చిత్రం కేంద్రీకృతమై ఉంది.అండమాన్ సముద్రం వద్ద ఏర్పడిన అల్పపీడనం బలపడి తీర వాయుగుండం గా మారిందని భారత వాతావరణ విభాగం తెలిపింది.ఈ ప్రభావంతో ఒడిశా పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురవ నున్నాయి.
18.తిరుమలేశుని సన్నిధిలో దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు దీపావళి ఆస్థానం టిటిడి నిర్వహించనుంది.
19.ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం
శ్రీకాకుళంలో విశాఖ రాజధాని కోసం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జేఏసీ సమావేశం అయింది.ఈ సమావేశానికి వ్యాపారవేత్తలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు ,ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు హాజరయ్యారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,010 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,290
.