ఆ వ‌య‌సు వారు ప్ర‌తి రోజు దానిమ్మ తినాల‌ట‌.. ఎందుకంటే?

చూసేందుకు ఎర్ర‌గా నిగ‌నిగ‌లాడుతూ అందంగా క‌నిపించే దానిమ్మ పండు తినేందుకు కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది.అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా ఈ పండును తింటుంటారు.

 People Over 40 Should Eat Pomegranate Daily! Pomegranate, People Over 40, Latest-TeluguStop.com

అలాగే విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిస్ సి, విట‌మిన్ కె, ఐర‌న్‌, కాల్షియం, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబ‌ర్ మ‌రియు శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా నిండి ఉండ‌టం వ‌ల్ల‌.దానిమ్మ ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది.

ముఖ్యంగా న‌ల‌బై ఏళ్లు పైబ‌డిన వారు ఖ‌చ్చితంగా ప్ర‌తి రోజు ఒక దానిమ్మ పండును తినాల‌ని నిపుణులు చెబుతున్నారు.ఎందుకు తినాలో.అస‌లు తింటే ఏయే ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయో.ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా న‌ల‌బై ఏళ్లు దాటాయంటే చాలు.కీళ్ల నొప్పులు, కండ‌రాల వాపులు వంటివి తీవ్రంగా మ‌ద‌న పెడుతూ ఉంటాయి.

అయితే దానిమ్మ పండును తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులు, కండ‌రాల వాపుల‌ను అద్భుతంగా నివారిస్తాయి.

అలాగే న‌ల‌బై ఏళ్లు పైబ‌డిన వారు ముడ‌త‌లు, చ‌ర్మం సాగ‌డం, హెయిర్ ఫాల్ వంటి స‌మ‌స్య‌ల‌తో ఎంత‌గానో క‌ల‌వ‌ర ప‌డుతుంటారు.వీటిని దూరం చేయ‌డంలో దానిమ్మ సూప‌ర్‌గా హెల్ప్ చేస్తుంది.

అవును, ప్ర‌తి రోజు దానిమ్మ పండు తింటే న‌ల‌బై ఏళ్లు దాటినా చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరుస్తూ ఉంటుంది.అదే స‌మ‌యంలో హెయిర్ ఫాల్ కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Telugu Tips, Latest, Pomegranate-Telugu Health Tips

అంతే కాదండోయ్‌.న‌ల‌బై ఏళ్లు పైబ‌డిన స్త్రీ, పురుషులు రెగ్యుల‌ర్‌గా దానిమ్మను తింటే క్యాన్స‌ర్‌, గుండె పోటు, అల్జీమ‌ర్స్‌ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధ్యులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.కాలేయం శుభ్ర ప‌డుతుంది.ర‌క్త పోటు స్థాయిలు అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.మ‌రియు మూత్ర సంబంధిత వ్యాధులు సైతం దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube