ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమా ఎంత డిజాస్టర్గా మిగిలిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటివరకు టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కొరటాల శివకు ఇక ఆచార్య ఒక చేదు అనుభవంగా మిగిలి పోయింది అని చెప్పాలి.
చిరంజీవి రామ్ చరణ్ లాంటి ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో పెట్టిన కూడా ఎందుకో కొరటాల శివ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఈ సినిమా కారణంగా అటు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా నష్టాల్లో కూరుకు పోయారు.
ఆచార్య డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.సాధారణంగా డిజైన్స్ తర్వాత ఆ దర్శకుడి తో సినిమా చేయడానికి ఎవరూ సాహసం చేయరు.
కానీ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ స్క్రిప్టు బాగా నచ్చడంతో చేయడానికి రెడీ అయిపోయాడు.అయితే సాధారణంగా పేపర్ మీద ఉన్నది ఉన్నట్టు తీసే దర్శకులు చాలా తక్కువ మంది.
ఈ క్రమంలోనే ఇక కొరటాల శివకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడంటే అది పెద్ద సాహసమే అని చెప్పాలి.
అయితే ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ చెప్పే మాటలను లెక్క చేయడం లేదు అన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.ఆచార్య సినిమాకు ఏడాదికిపైగా టైం తీసుకున్నాడు.ఇక కాజెల్ ను తీసుకొని అనవసరం అంటూ మళ్లీ తీసేసాడు.
ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా విషయంలో ఇదే చేస్తున్నారట.సాయి పల్లవి, రష్మిక సరిగ్గా సరిపోతారని వాళ్ళని తీసుకోండి అంటూ ఎన్టీఆర్ చెప్తే.
కొరటాల శివ మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ కోసం వెంపర్లాడుతున్నాడని తెలుస్తోంది.ఇప్పటికే ఆలియా భట్, కియారా డేట్స్ లేక నో చెప్పేశారట.
హీరోయిన్ సెట్ కాకపోవడంతో ఇప్పుడికి షూటింగ్ ప్రారంభం కాలేదని తెలుస్తోంది.ఇలా ఆచార్య విషయంలో చేసిన తప్పే ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా కొరటాల శివ చేస్తున్నారట.