చాలామందికి సాధారణంగా కళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి.అయితే కుడి కన్ను కొట్టుకుంటే ఆరోజు వారికి ఏదో మంచి జరుగుతుందని ఏడమ కన్ను కొట్టుకుంటే శుభ సంకేతమని చాలా మంది పరిగణిస్తారు.
అయితే ఇదే విషయం స్త్రీల విషయంలో మాత్రం తారుమారుగా ఉంటుంది.స్త్రీలకు ఎడమ కన్ను కొట్టుకుంటే మంచి జరుగుతుంది.
కుడి కన్ను కొట్టుకుంటే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది.అయితే సాధారణంగా కళ్ళు తక్కువ సమయంలోనే రెప్ప వేయడం ఆగిపోతుంది.
కానీ కొన్నిసార్లు ఒక గంట పాటు కన్ను కొట్టుకోవడం కొనసాగుతూనే ఉంటుంది.కొంతమందికి అయితే రోజుల పాటు ఇలా కళ్ళు కొట్టుకుంటూనే ఉంటాయి.అయితే ఇలాంటి సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే ఇది మంచి లేదా చెడు సంకేతం కాదని కంటికి సంబంధించిన వ్యాధి వస్తున్న సంకేతాలనీ వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే కనురెప్పల మయోకేమియా అనే వ్యాధి ఉంటే కనురెప్పలు ఇలా రోజుల తరబడి కొట్టుకుంటూ ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ వ్యాధి రావడానికి కారణం ఆందోళన, కళ్ళు అలసిపోవడం, డ్రగ్స్ తీసుకోవడం, అలాగే కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం, అలాగే నిద్రలేమి వంటి సమస్యల వల్ల ఈ వ్యాధి వస్తుంది.
ఈ వ్యాధి వచ్చిన వారికి కళ్ళు కొట్టుకోవడం గంటలు లేదా రోజులు తరబడి కొనసాగుతూనే ఉంటుంది.ఆ తర్వాత దానంతట అదే మెరుగవుతుంది.ఇక ఇలా కళ్ళు కొట్టుకోవడం వల్ల వచ్చే మరో వ్యాధి కూడా ఉంది.ఇది తీవ్రమైన కంటి వ్యాధిగా పరిగణించబడింది.

అయితే ఇందులో కళ్ల కండరాలు కుచించిపోయి ఉంటాయి.అయితే కళ్ళు రెప్పలిస్తే మాత్రం నొప్పి వస్తుంది.అలాగే కొన్నిసార్లు కళ్ళు తెరవడానికి కూడా చాలా కష్టమైపోతుంది.ఇక కళ్ళతో పాటు కనుబొమ్మల కండరాలు కూడా మెలికలు తిరుగుతాయి.అలాగే దృష్టి కూడా మసకబారుతుంది.ఇలా ఈ వ్యాధి కారణంగా మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడతారు.
అందుకే మూఢ నమ్మకాలు వదిలేసి.మంచి చెడు అని ఆలోచించకుండా అలా కన్ను కొట్టుకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.