గుడిలో ఇచ్చే తీర్థం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయాలను దర్శించడం పురాతన కాలం నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది.దేవాలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు దేవుడికి కొబ్బరికాయ సమర్పించి తమ కోరికలను నెరవేర్చమని వేడుకుంటాడు.

 Theertham, Temples, Panchamrutham, Hindu Temples, Kashaya Theertham, Paanaka Thi-TeluguStop.com

అయితే దేవుడి దర్శనానంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందిస్తారు.స్వామివారి అనుగ్రహం మనకు కలగాలని తీర్థం తీసుకోవడం ఆనవాయితీ గా భావిస్తారు.

కొన్ని దేవాలయాలలో కొన్ని రకాల తీర్థాలను ప్రసాదిస్తూ ఉంటారు.అయితే ఆ తీర్థం వెనుక ఉన్న పరమార్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

కొన్ని దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్నిచోట్ల జల తీర్థం, పంచామృత తీర్థం, పానక తీర్థం, కషాయ తీర్థం వంటి తీర్థాలను ప్రసాదిస్తూ ఉంటారు అయితే ఈ తీర్థాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

జలతీర్థం:

జల తీర్థం అనగా మనం కొబ్బరికాయ స్వామివారికి నివేదించినప్పుడు అందులోని నీటిని జలతీర్థం అంటారు అంతేకాకుండా స్వామివారికి అభిషేకం నిర్వహించేటప్పుడు అభిషేకం చేసిన నీటిని కూడా జల తీర్థంగా భావిస్తారు.ఈ నీటిని తీసుకోవడం ద్వారా అకాల మరణం, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

పంచామృత తీర్థం:

పంచామృతం సేవించడం ద్వారా మనం చేపట్టిన ఎటువంటి కార్యక్రమాలు అయినా దిగ్విజయంగా పూర్తి కావాలని పంచామృత తీర్ధాన్ని ప్రసాదిస్తారు.అంతేకాకుండా పంచామృత తీర్థాన్ని సేవించడం ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

పానక తీర్థం:

కొన్ని దేవాలయాలలో దేవునికి నైవేద్యంగా పానకాన్ని సమర్పించడం ద్వారా అక్కడికి వచ్చే భక్తులకు పానక తీర్థాన్ని ప్రసాదిస్తారు.ఈ ప్రసాదాన్ని సేవించడం ద్వారా మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది.అంతేకాకుండా జ్ఞాపకశక్తి మెరుగుపడటంతో పాటు మన శరీరాన్ని ఎంతో చురుగ్గా తయారు చేస్తుంది.శ్రీరామనవమి వేడుకలప్పుడు పానక తీర్థాన్ని భక్తులకు ప్రసాదిస్తారు.

కాషాయ తీర్థం:

కాషాయతీర్థంలో తులసీ దళాలను, బిల్వ దళాలను కలిపి తీర్థంగా ఇవ్వడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.తీర్థం ఇచ్చేటప్పుడు అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం, సకలపాప క్షయకరం అనే మంత్రం చదువుతారు కాబట్టి, దేవాలయాన్ని దర్శించినప్పుడు తీర్థ ప్రసాదాలు తప్పకుండా సేవించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube