ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ సన్నిధికి వెళ్లే భక్తులకు ఇది శుభవార్త అని చెప్పాలి.విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
శ్రీకాకుళం రోడ్డు, వరంగల్ ప్రత్యేక రైలు 07148 నేటి మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీకాకుళం రోడ్డు జంక్షన్ లోని బయలుదేరి రేపు ఉదయం 6 గంటలకు వరంగల్ చేరుకునే అవకాశం ఉంది.అంతేకాకుండా వరంగల్, బరంపురం ప్రత్యేక రైలు 07149 రేపు సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ లో బయలుదేరి ఆ తర్వాతి రోజు ఉదయం 11:15 నిమిషములకు బరంపురం చేరుకునే అవకాశం ఉంది.
బరంపురం, విజయవాడ రైలు 07150 17వ తేదీ మధ్యాహ్నం 12.45 నిమిషములకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారు జామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.విజయవాడ, బరంపూర్ మధ్య నడిచే రైలు 07151 15 నుంచి 20వ తేదీల మధ్య ప్రతిరోజు విజయవాడలో రాత్రి 9 గంటల 20 నిమిషములకు బయలుదేరి ఆ తర్వాతి రోజు ఉదయం 11:15 నిమిషములకు బరంపురం చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07152 బరంపూర్ లో మధ్యాహ్నం 12.45 నిమిషములకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారు జామున 3 గంటలకు విజయవాడ చేరుకునే అవకాశం ఉంది.
ఈ రైలు భవాని భక్తుల కోసం నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.గత కొన్ని నెలల నుంచి కృష్ణమ్మ ఒడిలో చేరి జలాధివాసంలో ఉన్న ప్రాచీన సంగమేశ్వరాలయం నెమ్మదిగా దేవాలయ గోపురం బయట పడుతుంది.శ్రీశైలం జలాశయ ప్రాజెక్టులోని నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతూ ఉండడంవల్ల కొత్తపల్లి మండలంలోని సంఘమా తీరంలో వెలసిన పురాతన సంగమేశ్వర ఆలయ గోపురం బయటపడుతూ కనిపిస్తోంది.
దీంతో దేవాలయ పురహితులు తేలకపల్లి రఘురామ శర్మ ఆధ్వర్యంలో సంగమేశ్వరాలయం శిఖరానికి కుంకుమార్చన, పుష్పార్చన, జలాభిషేకం, మంగళహారతి లాంటి విశేష పూజలు చేస్తున్నారు.