పూర్వం రాజదర్బారులో( Rajdarbaru ) ఒక తాంత్రికుడు ఉండేవాడు.వృద్ధాప్యం మీద పడడంతో తెలివైన బాలుణ్ణి తనకు అప్పగిస్తే తనకి మంత్ర తంత్రాలు నేర్పుతాను అన్నాడు.
రాజు అందుకు ఒప్పుకున్నాడు.ఆ బాలుడు తాంత్రిక విద్య నేర్చుకోవడానికి వృద్ధుని ఆశ్రమానికి వెళ్తూ మార్గం మధ్యలో ఉన్న మతాచార్యుని ఉపదేశాలు కూడా వినేవాడు.
ఇస్లాం మతాచార్యుల ఉపదేశాలు అతన్ని ఆకట్టుకున్నాయి.రోజు ఆ బాలుడు అలానే చేసేవాడు.
రోజులు గడుస్తూ ఉన్నాయి.ఆ బాలుడు అంధులు, కుష్టు రోగులు తదితరులకు వ్యాధి నయం చేసేవాడు.

అయితే వాళ్లంతా అల్లాహ్ ( Allah )ను విశ్వసించాలన్న షరతులు విధించేవాడు.తన దగ్గరకు ఏ రోగి వచ్చిన ఓ అల్లాహ్! నువ్వు ఇతని జబ్బును దూరం చేయి అని ప్రార్థించేవాడు.వారి అనారోగ్య సమస్యలు( Health problems ) దూరం అవడంతో అతడి పేరు ఆ ప్రాంతంలో మార్మోగ సాగింది.ప్రజలు బాలుడిని అంతగా మెచ్చుకోవడం ఆ నిరంకుశ రాజుకు నచ్చలేదు.
తన ప్రాముఖ్యత తగ్గినట్లు అనిపించి ఎందరో విశ్వాసులను హత మార్చాడు.చివరకు పర్వత శిఖరం మీద నుంచి బాలుడిని తోసెయ్యమని భటులకు ఆదేశించాడు.
అలా వెళ్తుండగా పసివాడు అల్లాహ్‌ను ప్రార్ధించాడు.అంతే పర్వతం కంపించి భటులు కుప్పకూలిపోయారు.

బాలుడు మాత్రం సురక్షితంగా ఉన్నాడు.రాజుకు మతి పోయింది.తర్వాత సముద్రంలో పడేయమన్నాడు.అక్కడ భంగపాటే ఎదురయింది.అతడు అల్లాహ్‌ను ప్రార్థించగానే పడవ మునిగిపోయింది.అతడు తప్ప అంతా చనిపోయారు.
రాజు నివ్వెర పోయాడు.అప్పుడు బాలుడు నన్ను చంపాలన్నదే తమరి ధ్యేయమైతే అల్లాహ్ నామంతో బహిరంగ ప్రదేశంలో ప్రజలందరికీ సమావేశపరిచి నాపై బాణం సంధించండి అన్నాడు.
రాజు అలాగే చేశాడు.వెంటనే పసివాడు మరణించాడు.
మేము కూడా ఇతడిలానే ప్రభువును విశ్వసిస్తున్నాము అంటూ ధైర్యంగా అక్కడ చేరిన ప్రజలు చెప్పారు.తను చనిపోతూ ప్రజలందరినీ అల్లాహ్ దాసులుగా మార్చాడు.
ఈ గాథ ఖురాన్ లో అల్లా పట్ల విశ్వాసాన్ని ప్రజలలో కలిగించింది.