భోళా శంకరుడికి జమ్మి ఆకులతో పూజ చేసే నియమాల గురించి తెలుసా..?

లయకారుడు శివుడిని మహాదేవుడు అని పిలుస్తారు.జలాభిషేకం చేస్తే చాలు తనను పూజించిన భక్తులు కోరిన కోరికలు తీర్చే భోళా శంకరుడిని ఎంతోమంది భక్తజనం పూజిస్తూ ఉంటారు.

 Did Bhola Shankar Know About The Rules Of Performing Pooja With Jammi Leaves , H-TeluguStop.com

అందుకోసం హిందూ ధర్మం( Hindu Dharma )లో శివలింగ ఆరాధనకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది.నీరు, బిల్వపత్రం, ఉమ్మెత్త, జమ్మి ఆకులు మొదలైనవి శివలింగ పూజకు ముఖ్యమైనవిగా భావిస్తారు.

శివలింగాన్ని శమీ ఆకులతో పూజించడం వల్ల భగవంతుడు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని నమ్ముతారు.అయితే జమ్మి ఆకులతో శివుడికి పూజించే సమయంలో కొన్ని నియమాలు కచ్చితంగా ఉంటాయి.

ఆ నియమాలను గురించి తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది.కాబట్టి ఈ రోజు శివలింగానికి శమీ ఆకులను సమర్పించే విధానం, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bhakti, Devotional, Hindu Dharma, Jobs Businesses, Scholars, Shiva Purana

ముఖ్యంగా చెప్పాలంటే తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానం చేసిన తర్వాత ముందుగా శివాలయానికి వెళ్లి ఉత్తరం లేదా తూర్పు దిశలో శివలింగం దగ్గర కూర్చోవాలి.దీని తర్వాత ఓం నమః శివాయ( Om Namah Shivaya ) అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి.శివునికి ఇష్టమైన పూలు, బిల్వపత్రాలు, జమ్మి ఆకులను శివలింగానికి సమర్పించాలి.అంతేకాకుండా తప్పనిసరిగా తెల్లని వస్త్రాలు, జంధ్యం, అక్షతలు, జనపనారను కూడా సమర్పించడం మంచిది.అలాగే శివలింగానికి జమ్మి ఆకులను సమర్పించేటప్పుడు తాజా ఆకులను మాత్రమే ఉపయోగించాలి.అప్పటికప్పుడు కోసిన ఆకులతో మాత్రమే పూజ చేయడం మంచిది.

Telugu Bhakti, Devotional, Hindu Dharma, Jobs Businesses, Scholars, Shiva Purana

అంతే కాకుండా శివ పురాణం ( Shiva Purana )ప్రకారం శివలింగం, శివుని పూజలో జమ్మి ఆకులను చేర్చడం వల్ల శివుడు త్వరగా సంతోషిస్తాడు.అలాగే భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తాడు.శివలింగానికి శమీ ఆకులను సమర్పించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా దూరమవుతాయి.అలాగే ఉద్యోగ, వ్యాపారాలలో కూడా లాభం ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే శివునికి అంకితం చేయబడిన సోమవారం రోజు పరమశివుడిని భక్తితో పూజిస్తే ఎల్లప్పుడూ శివుడు మీతోనే ఉంటాడని పండితులు( Scholars ) చెబుతున్నారు.

దీని వల్ల మీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube