ఎలాంటి మచ్చ లేకుండా ముఖం తెల్లగా మెరిసిపోతే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.కానీ, ఏదో ఒక కారణం చేత ముఖంపై మచ్చలు పడుతూనే ఉంటాయి.
వాటిని వదిలించుకోవడం కోసం మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల క్రీములను కొనగోలు చేసి యూస్ చేస్తుంటారు.అయితే వాటి వల్ల ఉపయోగం ఎంత ఉంటుందో తెలియదు గానీ.
ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ క్రీమ్‌ను నెల రోజుల పాటు వాడారంటే మచ్చలు పోయి ముఖం తెల్లగా మారుతుంది.మరి ఇంకెందుకు లేటు ఆ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి, కొన్ని ఎండిన గులాబీ రేకలు వేసి జెల్లీగా మారేంత వరకు ఉడికించాలి.
ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.
కంప్లీట్‌గా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సాయంతో జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జెల్‌లో మూడు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా మిక్స్ చేసుకుంటే.క్రీమ్ సిద్ధం అవుతుంది.

ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు.ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు రాత్రి నిద్రించడానికి ముందు ఈ హోం మేడ్ క్రీమ్‌ను రాసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు నెల రోజుల పాటు ఈ క్రీమ్‌ను వాడితే చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా క్రమంగా మాయం అవుతాయి.
అదే సమయంలో ముఖం తెల్లగా, కాంతివంతంగా కూడా మారుతుంది.