మీ పిల్లలు హైట్ సరిగ్గా పెరగడం లేదా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

ఇటీవల రోజుల్లో చాలా మంది పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు ఉండడం లేదు.సరైన ఎత్తు లేకపోవడం వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది.

 This Powder Helps To Increase Children's Height! Children's Height, Health, Heal-TeluguStop.com

అందుకే తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు.ఎత్తు పెరగడం లేదనే కారణంతో తమ పిల్లలను తరచూ హాస్పిటల్స్ కి తిప్పుతూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే వర్రీ అవ్వడం మానేసి ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకోండి.

పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు పెరగాలి అంటే మొదట వారి డైట్ పై దృష్టి సారించాలి.ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్, బీన్స్ ( Eggs, chicken, beans )వంటి ఆహారాలను వారి చేత తినిపించాలి.

వారి డైట్ లో కూరగాయలు, ఆకుకూరలు, సీజనల్ పండ్లు( Vegetables, greens, seasonal fruits ) ఉండేలా చూసుకోవాలి.అలాగే ఇప్పుడు చెప్పబోయే పొడి పిల్లల హైట్ ని పెంచడానికి ఉత్తమంగా సహాయపడుతుంది.

Telugu Tips, Powder, Latest, Powderhelps-Telugu Health

అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో అర కప్పు నువ్వులు( Sesame seeds ), ఒక కప్పు ఫూల్ మఖానా( fool makhana ), ఒక కప్పు బాదంపప్పు, రెండు టేబుల్ స్పూన్లు సోంపు విడివిడిగా వేయించుకోవాలి.ఇప్పుడు ఈ వేయించుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడిని కలిపి పిల్లల చేత తాగించాలి.

నిత్యం ఈ పొడిని పాలలో కలిపి పిల్లలకు ఇస్తే వారి శారీరక మరియు మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది.మంచిగా హైట్ పెరుగుతారు.ఎముకలు కండరాలు దృఢంగా సైతం మారతాయి.

Telugu Tips, Powder, Latest, Powderhelps-Telugu Health

ఇక పిల్లలను ఎప్పుడూ బుక్స్ కే పరిమితం చేయకుండా నిత్యం వారితో ఆటలు ఆడించండి.ఎక్సర్సైజ్ చేయించండి.వారి బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి.

ఎదుగుతున్న పిల్లలకు నిద్ర కూడా ఎంతో అవసరం.కాబట్టి స్క్రీన్ టైమ్ ను తగ్గించి స్లీప్ టైం ని పెంచండి.

అంతేకాకుండా రోజు ఉదయం సన్ రైస్ లో పిల్లల్లో కాసేపు ఉంచండి.తద్వారా విటమిన్ డి అందుతుంది.

పిల్లల హైట్ పెంచడానికి ఇది చాలా అవ‌స‌రం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube