చలి కాలం ప్రారంభం అయిపోయింది.ప్రజలపై చలి పులి పంజా విసురుతోంది.
గత వారం రోజులుగా రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో.ప్రజలు చలికి వణికిపోతున్నారు.
ఇక ఈ కాలంలో చలి మాత్రమే కాదు.రోగాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
వాతావరణంలోని మార్పుల వల్ల ఈ సీజన్‌లో రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ముఖ్యంగా ఆస్తమా, అలర్జీ, నిమోనియా, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ వంటి సమస్యలు ఈ కాలంలో తెగ ఇబ్బంది పెడుతుంటాయి.
అందుకే వింటర్ సీజన్ స్టాటింగ్ నుంచే ఆరోగ్యంపై దృష్టి సారించి.తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ప్రతి రోజు పోషకాహారం తీసుకోవాలి.ఇదిలా ఉంటే.
ఈ సీజన్‌లో ఉదయాన్నే ఓవైపు మంచు పడుతుంటే.మరోవైపు వేడి వేడిగా కాఫీ తాగే వారు చాలా మంది ఉంటారు.
కానీ, ఈ చలి కాలంలో కాఫీకి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.కాఫీలో ఉండే కెఫిన్‌నే అందుకు కారణం.
కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీను ఈ కాలంలో తీసుకుంటే.మూత్రవిసర్జన పెరిగి డీహైడ్రేషన్ సమస్య వస్తుందట.ఇక డీహైడ్రెషన్ కారణంగా అధిర రక్తపోటు, ఆస్తమా పెరగడం, అలసట వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అలాగే కెఫిన్ ఉండే కాఫీను తీసుకోవడం వల్ల.
గొంతు పొడిబారిపోవడం, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు మరియు శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి, కాఫీకి ఈ సీజన్‌లో దూరంగా ఉంటేనే మంచిది.
తప్పదు.తాగాల్సిందే అని అనుకుంటే ఎప్పుడో ఒక కప్పుకు మించకుండా తీసుకోవాలి.
ఇక కాఫీనే కాదు.ఎనర్జీ డ్రింక్స్‌లో కూడా కెఫిన్ అధికంగా ఉంటుంది.
సో.వాటిని కూడా ఈ వింటర్ సీజన్‌లో తీసుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.