ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..

మన దేశంలో ‘అతిథి దేవో భవ’ అంటే అతిథి దేవుడితో సమానం) అంటాం కదా? ఇంటికి వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయడంలో మనల్ని మించిన వాళ్ళు లేరని గొప్పగా చెప్పుకుంటాం.కానీ, కెనడాకు చెందిన ఓ ట్రావెలర్, నోలన్ సౌమురే ( Nolan Saumure ) మాత్రం దీనికి పూర్తి భిన్నమైన అభిప్రాయం చెప్పి అందరినీ షాక్‌కు గురిచేశాడు.

 If You Ask A Canadian About Hospitality, Whether India Is Great Or Pakistan Is G-TeluguStop.com

ఇండియా, పాకిస్థాన్లలో ఎక్కడ మంచి ఆతిథ్యం లభిస్తుందని అడిగినప్పుడు, అతను ఏమాత్రం ఆలోచించకుండా టక్కున “పాకిస్థాన్” అని చెప్పేశాడు.

స్ట్రీట్ ఇంటర్వ్యూలకు పేరుగాంచిన ఇన్‌స్టాగ్రామర్ @officialnamour, ఈ కెనడియన్‌ను ఇంటర్వ్యూ చేశాడు.“ఇండియా లేదా పాకిస్థాన్, ఏ దేశంలో ఆతిథ్యం అదిరిపోతుంది?” అని అడగ్గానే, సౌమురే వెంటనే, “ఖచ్చితంగా పాకిస్థానే” అని కుండబద్దలు కొట్టాడు.ఎందుకలా అని అడిగితే అసలు విషయం చెప్పాడు.

భారతీయులు చాలాసార్లు విదేశీయులను “నడిచే ఏటీఎంల” లాగా చూస్తారని, వాళ్లని అతిథులుగా కాకుండా డబ్బులు గుంజడానికి వచ్చిన కస్టమర్లుగా ఫీలవుతారని వివరించాడు.

కానీ పాకిస్థాన్‌లో( Pakistan ) పరిస్థితి వేరు అంటున్నాడు.

అక్కడ ప్రజలు ఎంతో ఆప్యాయంగా ఉంటారని, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారని చెప్పాడు.పాకిస్థాన్‌లో ప్రజలు ఉచితంగా భోజనం పెడతారని, తమ ఇళ్లకు రమ్మని పిలిచి, సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారని అన్నాడు.“మీరు ఇండియాకు వెళ్తే, జనం మిమ్మల్ని నడిచే ఏటీఎంలా చూస్తారు.అదే పాకిస్తాన్‌కు వెళ్తే, ‘అరే ఇక్కడకు రా, కూర్చో.

ఈ ఫ్రీ ఫుడ్ తీసుకో.మా ఇంట్లో పడుకో’ అని అంటారు” అని తేల్చి చెప్పాడు సౌమురే.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫానులా మారింది.ఇప్పటికే లక్షల్లో పైగా వ్యూస్ వచ్చాయి.కామెంట్ల గురించి చెప్పక్కర్లేదు.బోర్డర్‌కు అటు, ఇటు పెద్ద చర్చే నడుస్తోంది.చాలా మంది సౌమురే( Saumur ) చెప్పిందే కరెక్ట్ అంటున్నారు.దుబాయ్‌లో నివసించే ఓ ఆఫ్రికన్ వ్యక్తి, “ఇండియన్ల కంటే పాకిస్థానీయులే ఫ్రెండ్లీ పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఫ్రెండ్‌లా చూస్తారు, ఇండియా వాళ్లు ఎవరో పరాయి వ్యక్తిలా చూస్తారు” అని కామెంట్ పెట్టాడు.

అయితే, కొందరు మాత్రం సౌమురేను విమర్శిస్తున్నారు.“మా ఇండియా నుంచి 45 ట్రిలియన్ డాలర్లు దోచుకుపోయిన మీరు ఇప్పుడు మా దగ్గర ప్రిన్సెస్ లాంటి ట్రీట్‌మెంట్ ఆశించడం ఏంటి?” అని ఒక నెటిజన్ ఫైర్ అయ్యాడు.దానికి సౌమురే కూడా కూల్‌గా, “వేధించకుండా ఉంటే చాలు అనడం ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్ కాదు బ్రదర్” అని రిప్లై ఇచ్చాడు.అసలు ఎవరీ నోలన్ సౌమురే అంటారా? ఇతను ఒక ట్రావెల్ వ్లాగర్.ఇప్పటికే ఇండియా, పాకిస్తాన్‌లతో పాటు శ్రీలంక, మెక్సికో, ఇండోనేషియా, అమెరికా, వియత్నాం సహా చాలా దేశాలు చుట్టేశాడు.ఆ అనుభవంతోనే ఇలా తన అభిప్రాయం చెప్పాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube