మారుతున్న జీవనశైలి కారణంగా కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి.అలాగే నిత్యం ఒత్తిడితో కూడుకున్న జీవితం, క్షణం కూడా తీరిక లేకుండా పని చేసిన మనిషి ఒత్తిడితో సతమతమవుతున్నాడు.
అయితే ఈ జీవన విధానం మారిపోయిన కారణంగా వస్తున్న ప్రధాన సమస్య రక్తపోటు( blood pressure ) అని చెప్పవచ్చు.ఒకప్పుడు కనీసం 60 ఏళ్ళు దాటిన వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది.
కానీ ప్రస్తుతం పాతికేళ్ళ కుర్రాడికి కూడా రక్తపోటు ఉన్నట్టు కనిపిస్తోంది.ఇక ఆహారంలో ఉప్పు( salt ) ఎక్కువగా తీసుకోవడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం, ఒత్తిడి కారణం ఏదైనా కానీ బీపీ బారిన పడుతున్నారు.
ఈ బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది.దీంతో కాలక్రమేణా ఈ బీపీ హృద్రోగాలకు సైతం దారి తీస్తుంది.అయితే బీపీ నీ ముందుగానే గుర్తించి జీవన విధానం లో మార్పులు చేయడం, ఆహార విషయంలో జాగ్రత్తలు పాటిస్తే బీపీతో దూరంగా ఉండవచ్చు.అయితే రాత్రిపూట కనిపించే కొన్ని లక్షణాల ద్వారా రక్తపాటు సమస్య ఉందా, లేదా అన్నది ముందుగానే గుర్తించవచ్చు.
ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఛాతీ నొప్పి గుండె సమస్యకు ప్రధాన లక్షణంగా భావిస్తాము.
అయితే కొన్ని సందర్భాల్లో రాత్రిపూట ఛాతీ నొప్పి( Chest pain ) వస్తుంది.నొప్పి క్రమం తప్పకుండా ఒకే వైపు వస్తే అది బీపీకి లక్షణంగా భావించాలి.
అప్పుడు వెంటనే బీపీ చెక్ చేసుకోవాలి.
ఇక రాత్రి పడుకున్న తర్వాత తరచుగా మూత్ర విసర్జన( urination ) వస్తున్న కూడా బో ఉందని భావించాలి.ఎందుకంటే బీపీ కారణంగా కూడా రక్తనాళాలపై ఒత్తిడి పెరగడం, మూత్రపిండాలపై ప్రభావం పడడం ద్వారా తరచూ మూత్ర విసర్జన వస్తుంది.ఇక నిద్రలేమి కూడా రక్తపోటుకు లక్షణంగా భావించాలి.
అంతేకాకుండా ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా, నిత్యం అలిసిపోతున్నా లేదా నిత్యం బలహీనంగా అనిపిస్తున్న కూడా అది అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా భావించాలి.అప్పుడు వెంటనే ఈ సమస్యను గుర్తించి వైద్యులను సంప్రదించి బీపీని దూరం చేసుకోవాలి.