పెళ్లై దంపతలందరూ పిల్లలు కావాలని కోరుకుంటారు.సంతాన భాగ్యం ఉంటేనే దాంపత్య జీవితం కూడా పరిపూర్ణం అవుతుంది.
అయితే నేటి అధునిక కాలంలో సంతాన సమస్యలు ఆడవారితో పాటుగానే మగవారిలోనూ కనిపిస్తున్నాయి.ముఖ్యంగా ముప్పై ఏళ్లు పైబడిన మగవారిలో ఈ సమస్యలు అత్యధికంగా ఉంటున్నాయి.
ఈ క్రమంలోనే పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.అయితే మగవారిలో సంతాన సమస్యలు ఏర్పడటానికి చాలా కారణాలు ఉన్నాయి.
పొగ తాగటం, మద్యం సేవించటం, మానసిక ఆందోళన, పని ఒత్తిడి, వీర్యవృద్ధి తగ్గిపోవడం, శుక్ర కణాల సంఖ్య సరిగ్గా లేకపోవడం, మారిన జీవన శైలి ఇలా రకరకాల కారణాల వల్ల మగవారిలో సంతాన సమస్యలు తలెత్తుతాయి.అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టాలని భావించే వారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి.
సంతాన సమస్యలను దూరం చేయడంలో నువ్వులు-బెల్లం కాంబినేషన్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెండిని కలిపి రెగ్యులర్‌గా తీసుకుంటే వీర్యంలో శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది.ఫలితంగా సంతానం కలుగుతుంది.

అలాగే టమాటాను ప్రతి రోజు ఒకటి చప్పున ఏదో ఒక రూపంలో తీసుకుంటే గనుక.అందులో ఉండే విటమిన్ ఇ, జింక్ మరియు లైకోపిన్ అనే కాంపౌండ్ సంతానలేమి సమస్యను దూరం చేస్తుందని ఆరోగ్యానికి నిపుణులు చెబుతున్నారు.బాదం, వాల్నట్స్, జీడి పప్పు, పిస్తా పప్పు వంటివి తగిన మోతాదులో రెగ్యులర్‌గా తీసుకుంటే.
శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.

గుమ్మడి గింజలు కూడా సంతాన సమస్యలను నివారిస్తాయి.అందువల్ల, ప్రతి రోజు వీటికి ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఇక వీటితో పాటు చేపలు, రోయ్యలు, సీజనల్‌గా తొరికే తాజా పండ్లు, పాలు, గుడ్డు, ఐరన్ పుష్కలంగ ఉంటే ఆహారం తీసుకుంటే.
సంతాన సమస్యలకు చెక్ పెట్టవచ్చు.