ఎన్ఆర్ఐ ఓటింగ్‌ హక్కులు.. కేంద్రానికి పార్లమెంటరీ ప్యానెల్ కీలక ప్రతిపాదనలు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల ప్రక్రియ ఆషామాషీ కాదు.కానీ దాదాపు 70 ఏళ్ల పై నుంచి ఎన్నికలను కట్టుదిట్టంగా, పారదర్శకంగా నిర్వహిస్తూ వస్తోంది భారత ఎన్నికల సంఘం.

 Congress Mp Shashi Tharoor Led Parliamentary Panel Advocates For Granting Voting-TeluguStop.com

( Election Commission Of India ) ఎప్పటికప్పుడు సంస్కరణలు, సాంకేతికత సాయంతో ఎన్నికలను కొత్త పుంతలు తొక్కిస్తూ ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.ఇంత పెద్ద దేశంలో ఎన్నికల నిర్వహణ ఎన్నో సవాళ్లతో కూడుకున్న సంగతి తెలిసిందే.

కానీ అత్యంత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తూ మన్ననలు అందుకుంటోంది ఎన్నికల సంఘం.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుకున్నట్లుగా జరిగితే జమిలీ ఎన్నికలను( Jamili Elections ) కూడా నిర్వహించి మరో ఘనతను తన పేరిట లిఖించేందుకు రెడీ అవుతోంది.

Telugu Congressmp, India, Jamili, Nri Votes, Nris, Shashi Tharoor, Shashitharoor

ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐల ఓటింగ్‌కు( NRI’s Voting ) సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్( Parliamentary Panel ) కీలక ప్రతిపాదన చేసింది.ప్రాక్సీ ఓటింగ్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా భారత పౌరసత్వం కలిగిన ఎన్ఆర్ఐలకు ఓటు హక్కులు కల్పించాలని ప్యానెల్ కోరింది.ఈ విషయం ప్రస్తుతం న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని ప్యానెల్ తెలిపింది.కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్( Congress MP Shashi Tharoor ) సారథ్యంలోని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ ప్యానెల్ గురువారం భారత డయాస్పోరాపై తన నివేదికను సమర్పించనుంది.

ప్రభాస భారతీయులు అనే పదాన్ని వివిధ చట్టాలలో వేర్వేరుగా ఉపయోగిస్తున్నారని.ఈ పదానికి ఏకీకృత నిర్వచనం అవసరాన్ని కూడా ఈ నివేదిక పునరుద్ఘాటించింది.

Telugu Congressmp, India, Jamili, Nri Votes, Nris, Shashi Tharoor, Shashitharoor

ఓటర్ల జాబితాలోని ఎన్ఆర్ఐలు ఓటు వేయడానికి భౌతికంగా హాజరు కావాలని ప్రస్తుత నిబంధనలు పేర్కొంటుండటంతో ఎన్ఆర్ఐల ఎన్నికల హక్కులు పక్కదారి పడుతున్నట్లు ప్యానెల్ గుర్తించింది.భారత పౌరసత్వం లేదని , ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఎన్ఆర్ఐల సంఖ్య పెరుగుతుండటం గురించి ప్యానెల్ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.ఈ విషయాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ , భారత ఎన్నికల సంఘం రెండింటితోనూ ముందుకు తీసుకెళ్లాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ప్యానెల్ కోరింది.ప్రాక్సీ ఓటింగ్ లేదా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఉపయోగించడం వంటి పరిష్కారాలను ఇది ప్రతిపాదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube