విదేశీయులు భారతదేశాన్ని సందర్శించి ఇక్కడి ఆహారం, సంస్కృతిని ఆస్వాదించడాన్ని తరచూ సోషల్ మీడియాలో చూస్తుంటాం.భారతీయ సంప్రదాయ వంటకాల రుచి చూస్తూ వారి అనుభవాలను వీడియోల రూపంలో పంచుకుంటారు.
ఇటువంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి.ముఖ్యంగా భారతీయ స్వీట్స్‌ను( Indian Sweets ) తొలిసారి రుచి చూస్తున్న విదేశీయుల అనుభవాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.
ఇటీవలి కాలంలో ఒక కెనడియన్ అమ్మాయి( Canadian Girl ) తొలిసారిగా బూందీ లడ్డు( Boondi Laddu ) తిన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇందులో ఓ భారతీయ విద్యార్థి, తన కెనడియన్ స్నేహితురాలికి భారతీయ వంటకాలను పరిచయం చేస్తుంటాడు.ఆమె ప్రతిసారి భిన్నమైన రుచి, కొత్త అనుభవాన్ని ఆస్వాదిస్తూ తన హావాభావాలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.తాజాగా, ఈ యువకుడు తన స్నేహితురాలికి బూందీ లడ్డు తినిపించాడు.
వీడియోలో, ఆ వ్యక్తి ఒక ప్లేట్‌లో బూందీ లడ్డూ వడ్డించి అమ్మాయికి అందించాడు.మొదటగా, ఆమె లడ్డూ వాసన చూడటం ప్రారంభించింది.
దాంతో ఆ వ్యక్తి భారతీయ సంప్రదాయంలో బూందీ లడ్డూని ఏ సందర్భాల్లో తయారు చేస్తారో వివరించాడు.ఆ తరువాత, అమ్మాయి లడ్డూని కొరికి తింటూ రుచి చూసింది.
ఆమెకు మొదట అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత ఆమె రుచి విశ్లేషించడం ప్రారంభించింది.ఆమె ప్రకారం, లడ్డూ అంతగా తియ్యగా లేదు కానీ చాలా నూనె ఉందని అనిపించిందట.
మధ్యలో కొన్ని వేరే రుచులు కూడా వస్తున్నాయని చెప్పింది.కానీ చివరికి, ఈ లడ్డూ తింటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్( Viral Video ) గా మారింది.దీనితో చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.అది బూందీ లడ్డూ కాదు.మోతీచూర్ లడ్డు( Motichoor Laddu ) అని కొందరు అంటుంటే.భారతీయుల వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఈ వీడియో చూసిన తర్వాత బూందీ లడ్డూ ఖచ్చితంగా విదేశీయులకు కూడా నచ్చే స్వీట్ అని అర్థమవుతోంది.