నేటి ఆధునిక కాలంలో ప్రతి వంద మందిలో యాబైకి పైగా మందిలో కామన్‌గా కనిపిస్తున్న సమస్య మధుమేహం.రక్తంలో చక్కెర స్థాయిలో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటమే మధుమేహం.
దీనినే డయాబెటిస్ లేదా చక్కెర వ్యాధి అని కూడా అంటారు.ముఖ్యంగా మన భారత దేశంలోనే కోట్ల మంది మధుమేహంతో బాధ పడుతున్నారు.
అది కూడా అతి చిన్న వయసులో ఈ వ్యాధి బారిన పడటం గమనార్హం.అయితే మధుమేహం వ్యాధి ఉన్న వారికి కొన్ని కొన్ని ఆహారాలు ఏంతో మేలు చేస్తాయి.
అలాంటి వాటిలో నిమ్మకాయ ఒకటి.అవును, మధుమేహం రోగులు రెగ్యులర్‌గా నిమ్మకాయను తగిన మోతాదులో తీసుకుంటే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.మరి ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఆలస్యం చేయకుండా చూసేయండి.సాధారణంగా మధుమేహం రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది.
అందుకే వారు తరచూ జబ్బుల బారిన పడుతుంటారు.

అయితే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే నిమ్మకాయను మధుమేహం ఉన్న వారు ప్రతి రోజు తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.అలాగే మధుమేహం ఉన్న వారు షుగర్ లెవల్స్‌ను అదుపు చేసుకునేందుకు ఇన్సులిన్ తీసుకుంటుంటారు.అయితే ప్రతి రోజు ఒకటి లేదా రెండు స్పూన్ల నిమ్మ రసాన్ని ఏదో రూపంలో తీసుకుంటే.
అందులో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.దాంతో ఇన్సులిన్ తీసుకునే అవసరం ఉండదు.

ఇక మధుమేహం ఉన్న వారికి జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.అయితే ప్రతి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి తీసుకుంటేగ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.అలాగే మధుమేహం ఉన్న వారు తరచూ అలసట, నీరసం వంటి సమస్యలతో ఇబ్బంది పడతాయి.అయితే నిమ్మ రసాన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు ఉదయం తీసుకుంటే నీరసం, అలసట సమస్యలు ఉండవు.