చాలామందికి ఎంతో ఇష్టమైన వాటిలో నిద్ర ఒకటి.ఇలా కొందరు పడుకోగానే నిద్రపోతూ ఉంటారు.
మరి కొందరు నిద్ర పోవడానికి ఎలాంటి స్థలం సౌకర్యాలను చూడరు వారికి ఎక్కడ పడుకోవాలనిపిస్తే అక్కడ నిద్రపోతుంటారు.మరి కొందరు ఇష్టానుసారంగా నిద్రపోతూ ఉంటారు.
కానీ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు నిద్రపోవడం వల్ల ఎన్నో అనర్థాలు అష్టదరిద్రాలు కలుగుతాయని నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి.మరి నిద్రపోయే ముందు ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలలోనూ దేవాలయాలలోనూ, స్మశాన వాటికలోను ఎప్పుడు నిద్ర పోకూడదని పురాణాలు చెబుతున్నాయి.అదేవిధంగా నిద్ర పోతున్న వారిని పొరపాటున కూడా మేల్కొల్ప కూడదు.ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోకూడదు ఆరోగ్యంతో ఉన్న వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ఎంతో శుభప్రదం.చాలా మంది పడుకునే ముందు వారి పాదాలను శుభ్రం చేసుకుని నిద్రపోతుంటారు అయితే తడి పాదాలతో నిద్రపోకూడదు.
ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
విరిగిన పడకపై ఎప్పుడు నిద్ర పోకూడదు.
అలాగే నగ్నం గా కూడా ఎప్పుడు నిద్ర పోకూడదని గౌతమ ధర్మ సూత్రం తెలియచేస్తోంది.పడుకునేటప్పుడు తూర్పు వైపు తల పెట్టి నిద్రపోవడం వల్ల సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది.అలాగే పశ్చిమ వైపు తల పెట్టి నిద్రపోవడం వల్ల ప్రబల చింత, ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోతే మృత్యువు సంభవించడం దక్షిణం వైపు తల పెట్టి నిద్ర పోతే డబ్బు ఆయు ప్రాప్తి కలుగుతుంది.ఇక చాలామంది పగటిపూట కూడా నిద్రపోతూ ఉంటారు.
ఇలా నిద్ర పోవడం పరమ దరిద్రం.చాలామంది సూర్యాస్తమయం ముందు నిద్రపోతుంటారు ఇలా నిద్ర పోవడం వల్ల ఇంట్లో అశుభం జరుగుతుంది.
అదేవిధంగా చాలామంది పడకపై తినడం తాగడం చేస్తుంటారు.ఇలా చేయడం మంచిది కాదు.