శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదామ్
శతృ బుద్ధి వినాశాయ దీపరాజ నమోస్తుతే.
భావం : దీపారాధన చేయడం వలన మంచి కలుగుతుంది.ఆరోగ్యము, ధనము వృద్ధి చెందుతుంది.శత్రువులు మనపై చేసే చెడు ఆలోచనలు నశిస్తాయి.
ఇన్ని మంచి లాభాలు ఉన్న దీపారాధనని ప్రతిరోజూ చేయమని సనాతన ధర్మం చెబుతోంది.దీపాన్ని తూర్పు వైపుగా పెడితే ఆరోగ్యం కలుగుతుంది.
పశ్చిమం లో దీపం పెట్టడం వలన భక్తి పెరుగుతుంది.ఉత్తరానికి పెడితే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.
దక్షిణానికి పెట్టడం అశుభము,మృత్యు కారకము.ఇది దీపం ఉండవలసిన దిక్కు.
భగవంతునికి దీపం ఏవైపు ఉండాలనే నియమం ఉంటుంది.మహా శివునికి ఎడమవైపు, విష్ణువుకు కుడి వైపు దీపాన్ని ఉంచాలి.
మధ్యలో దీపాన్ని పెట్టకూడదు.
ఒకే వత్తితో దీపాన్ని వెలిగించకూడదు.
ఒకసారి వెలిగించిన వత్తిని మళ్ళీ ఉపయోగించకూడదు.బైట దొరికే దీపా రాధన నూనెలను అవి వేటితో చేస్తున్నారో పరిశీలించకుండా ఉపయోగించరాదు.
దీపారాధనకి ఆవునెయ్యి శేష్ఠం.
LATEST NEWS - TELUGU