తిరుమలలో ఆ పుణ్య ప్రదేశంలో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటే.. పాపాలన్నీ దూరం..!

కలియుగ దైవం శ్రీ ఏడుకొండల స్వామిని దర్శించుకుంటే చాలని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు భావిస్తూ ఉంటారు.తిరుమల ( Tirumala ) చేరుకుంటున్నా భక్తులు క్యూ లైన్లలో గంటలు తరబడి వేచి ఉండి శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చి లడ్డు ప్రసాదం తీసుకుని తర్వాత తిరిగి ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉంటారు.

 Tirumala Thumburu Teertham Mukkoti Utsav On Full Moon Day Details, Tirumala ,thu-TeluguStop.com

అయితే తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చూడవలసిన ప్రాంతాలు ఎంతో ముఖ్యమైన పవిత్రమైన ప్రాంతాల గురించి చాలా తక్కువ మంది భక్తులకు తెలియదు.అలాంటి పవిత్రమైన ప్రాంతాల్లో తుంబురు తీర్థం ఒకటి.

ఆ రోజు మీరు తుంబురు తీర్థంలో( Thumburu Teertham ) స్నానం చేసే శ్రీవారిని దర్శించుకుంటే మీ కష్టాలు తీరిపోతాయని శాస్త్రాలలో ఉంది.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి 7 మైళ్ళ దూరంలో వెలిసిన శ్రీ తుంబురు తీర్థం ముక్కోటి ఉత్సవం( Mukkoti Utsav ) ఏప్రిల్ ఆరవ తేదీన జరగనుంది.పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్య తీర్థాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు.ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య,ముక్తి ప్రదాలు కలిగించేవి ఏడు ముఖ్యమైన తీర్థాలు కూడా ఉన్నాయి.

అవి స్వామి వారి పుష్కరిణి కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగా, పాప వినాశనం మరియు పాండవ తీర్థాలు ఈ తీర్థాలలో ఆయా పుణ్య గడియల్లో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవయితీగా వస్తోంది.అంతేకాకుండా ఈ పర్వదినం రోజు తీర్థ స్నానాలు చేసి తిరుమలలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.ప్రకృతి సౌందర్యాల మధ్య నిర్వహించే తుంబూరు తీర్థ ముక్కోటిని దర్శించి స్నానం చేయడం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని భక్తులు చెబుతూ ఉంటారు.

ఈ ముక్కోటిలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు కూడా పాల్గొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube